NTV Telugu Site icon

RRR : బరోడాలో అడుగుపెట్టిన టీం… ప్రమోషన్స్ కోసం దేన్నీ వదలని రాజమౌళి

RRR

RRR సినిమా మార్చ్ 25న విడుదల కానున్న నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ లో మేకర్స్ దూకుడు పెంచారు. భారీ బడ్జెట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ప్రచార వ్యూహాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఈ చిత్రం ప్రమోషనల్ ఈవెంట్స్ కోసం ‘ఆర్ఆర్ఆర్’ బృందం 5 రోజుల్లో భారతదేశంలోని 9 నగరాలను చుట్టిరానుంది. మార్చి 18న ఈ టూర్ హైదరాబాద్‌లో ప్రారంభం కాగా, టీమ్ అదే రోజున దుబాయ్‌ లో ఓ ఈవెంట్‌ను నిర్వహించితిన్ విషయం తెలిసిందే. మార్చ్ 19న బెంగళూరులో ఓ ప్రెస్ మీట్, అలాగే భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఇక ఈరోజు బరోడాలో దిగిన ‘ఆర్ఆర్ఆర్’ త్రయం అక్కడ ప్రమోషనల్ ఈవెంట్ లో పాల్గొననున్నారు.

Read Also : RRR Pre Release Event : గెస్ట్ గా కర్ణాటక సీఎం ఎందుకొచ్చారంటే ?

రామ్ చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి మార్చి 20న బరోడా, ఢిల్లీలను కవర్ చేస్తారు. అయితే ఇప్పటికే అక్కడ అడుగు పెట్టారు టీం. మరో తాజా అప్డేట్ ఏంటంటే జక్కన్న తన సినిమాను ప్రమోట్ చేసుకోవడానికి దేన్నీ వదిలి పెట్టడం లేదు. కెవాడియా, గుజరాత్ వంటి ప్రాంతాల్లో ప్రయాణించడానికి ప్రత్యేకంగా ‘ఆర్ఆర్ఆర్’ కార్లను తయారు చేశారు. ఇలా కార్లను కూడా ప్రమోషన్స్ కు ఉపయోగించుకుంటున్నాడు జక్కన్న. ఎంతైనా రాజమౌళి ప్రమోషన్స్ ప్లాన్స్ అదుర్స్ అంటున్నారు ఆయన అభిమానులు.

Image