Site icon NTV Telugu

Ram Charan: వైరల్ అవుతోన్న కొత్త లుక్.. అదిరిందయ్యా చరణ్!

Ram Charan Stylish Look

Ram Charan Stylish Look

సినిమా సినిమాకి మన హీరోలు లుక్ పరంగా వేరియేషన్స్ చూపిస్తుంటారు. ఒకే లుక్‌లో కనిపిస్తే ఫ్యాన్స్ సహా ఆడియన్స్‌కి బోర్ కొట్టడం సహజం. పైగా.. ప్రతీ సినిమా నుంచి కొత్తదనం కోరుకుంటారు కాబట్టి, దాన్ని దృష్టిలో పెట్టుకునే మన హీరోలు లుక్స్ మారుస్తుంటారు. మేకర్స్ కూడా వీరితో రకరకాల ప్రయోగాలు చేయిస్తుంటారు. స్క్రిప్ట్ డిమాండ్ మేరకు స్టైలిష్‌గా, రగ్డ్‌గా చూపించడానికి ప్రయత్నిస్తుంటారు. ఇప్పుడు రామ్ చరణ్‌ను దర్శకుడు శంకర్ తన సినిమాలో అల్ట్రా స్టైలిష్‌గా చూపించబోతున్నట్టు తెలుస్తోంది.

శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ తన తదుపరి సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే! శరవేగంగా ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ క్రమంలోనే రామ్ చరణ్‌కి సంబంధించిన కొత్త లుక్ బయటకు వచ్చింది. ఈ లుక్‌ని స్వయంగా చరణ్ స్టైలిస్ట్ అయిన ఆలిమ్ హకీమ్ ట్విటర్‌లో రిలీజ్ చేశాడు. అతడు రిలీజ్ చేసిన షార్ట్ వీడియోలో చరణ్ మునుపెన్నడూ లేని విధంగా స్టైలిష్‌గా దర్శనమిచ్చాడు. గెడ్డంతో పాటు పొడవాటి జుట్టుతో చరణ్ చాలా హ్యాండ్సమ్‌గా కనిపిస్తున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. చరణ్ లుక్ చాలా బాగుండడంతో, అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘ఆరెంజ్’ సినిమా టైంలో స్టైలిష్‌గా కనిపించిన చరణ్.. ఇప్పుడు ఇన్నాళ్ల తర్వాత స్టైలిష్ అవతారంలో తళుక్కుమనడంతో ఫ్యాన్స్ ఈ వీడియోని బాగా షేర్ చేస్తున్నారు.

కాగా.. శంకర్ దర్శకత్వంలో రామ్ చేస్తోన్న సినిమా పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతోంది. దిల్ రాజు నిర్మిస్తోన్న ఈ పాన్ ఇండియా సినిమాలో కియారా అద్వానీ కథానాయికగా నటిస్తోంది. తమన్ సంగీతం సమకూరుస్తోన్న ఈ చిత్రంలో చాలామంది పేరుగాంచిన నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇంకా టైటిల్ ఖరారు కానీ ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

Exit mobile version