NTV Telugu Site icon

Ram Charan: ఒక్క సినిమా కోసం ఇన్ని గెటప్స్ ఏంటయ్యా… చరణ్ న్యూ లుక్ చూసారా?

Ram Charan

Ram Charan

మెగా పవర్ స్టార్ పాన్ ఇండియా మార్కెట్ లో తన మ్యాజిక్ ని మరోసారి చూపించడానికి క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ తో కలిసి భారి సినిమా చేస్తున్నాడు. RC 15 అనే వర్కింగ్ టైటిల్ తో సెట్స్ పైకి వెళ్లిన ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ రెండు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రధాన సెంటర్స్ లో జరుగుతుంది. రాజమండ్రి టు కర్నూల్ వయా హైదరాబాద్ RC 15 షూటింగ్ ని చేస్తున్న శంకర్, చరణ్ ని ముందెన్నడూ చూడని లుక్ లో చూపించబోతున్నట్లు ఉన్నాడు. శంకర్ హీరో అంటే లుక్ నుంచి డైలాగ్ డెలివరీ వరకూ ప్రతి విషయంలో కొత్తగా కనిపిస్తాడు. ఇదే ట్రెండ్ లోకి చరణ్ ని కూడా లాగుతూ షెడ్యూల్, షెడ్యూల్ ని లుక్ చేంజ్ చేయిస్తున్నాడు. రీసెంట్ గా జరిగిన షూటింగ్ లో విలేజ్ లుక్ లో పొలిటికల్ క్యాంపెయిన్ చేస్తూ కనిపించిన చరణ్, తాజాగా కంప్లీట్ మేకోవర్ లో మోడరన్ లుక్ లోకి వచ్చేసాడు.

స్టైలిస్ట్ ఆలిమ్ హాకిమ్, చరణ్ కి కొత్త హెయిర్ స్టైల్ చేసి, ఆ ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ లుక్ లో చరణ్ అల్ట్రా మోడరన్ లుక్ లో ఉన్నాడు. హెయిర్ స్టైల్ చాలా ఫ్రెష్ గా ఉంది, ఇది త్వరలో చెయ్యబోయే సాంగ్ షూటింగ్ కి సంబంధించిన లుక్ అయ్యి ఉండొచ్చు. చరణ్, కియారా అద్వానీలపై శంకర్ లావిష్ గా డిజైన్ చేసిన ఒక సాంగ్ ని నెక్స్ట్ షెడ్యూల్ లో చెయ్యనున్నారు. కియారా అద్వానీ పెళ్లి కోసం సాంగ్ షూట్ కి కొన్ని రోజులు వాయిదా వేశారు. ఇప్పుడు కియారా పెళ్లి అయిపొయింది కాబట్టి త్వరలోనే సాంగ్ షూట్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ సాంగ్ కోసం శంకర్ ఎలాంటి మ్యాజిక్ చేస్తున్నాడో తెరపైనే చూడాలి. ఎందుకు అంటే శంకర్ సినిమాలో సాంగ్స్ చాలా స్పెషల్ గా ఉంటాయి.

Show comments