Ram Charan: రామ్ చరణ్ కృష్ణుడిగా రాబోతున్నాడా?.. ఆ రూ.120 కోట్ల బ్లాక్‌బస్టర్ రీమేక్‌లో…

Ram Charan 300kb

Ram Charan 300kb

Ram Charan: గుజరాతీ సినిమా అంటే ఇప్పటివరకు చిన్న బడ్జెట్, పరిమిత మార్కెట్ అనే అభిప్రాయం ఉండేది. కానీ ‘లాలో: కృష్ణ సదా సహాయతే’ ఆ అంచనాలన్నింటినీ తలకిందులు చేసింది. కేవలం రూ.50 లక్షల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.120 కోట్లకు పైగా వసూళ్లు సాధించి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిన తొలి గుజరాతీ చిత్రంగా రికార్డు సృష్టించిన ఈ మూవీ ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది. కారణం రీమేక్ వార్తలు మాత్రమే కాదు. ఈ సినిమాలో శ్రీకృష్ణుడి పాత్ర కోసం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పేరు వినిపిస్తుండటమే. మరి ఇంతటి సంచలన విజయం సాధించిన ‘లాలో’ కథ ఏమిటి? తెలుగు రీమేక్‌లో చరణ్ నిజంగానే కృష్ణుడిగా కనిపించబోతున్నారా?

ఆధ్యాత్మికత, కామెడీ అంశాలను కలిపి తెరకెక్కించిన ‘లాలో: కృష్ణ సదా సహాయతే’ గుజరాతీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. స్టార్ కాస్టింగ్ లేకుండా, అతి తక్కువ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఊహించని స్థాయిలో ప్రభావం చూపించింది. కేవలం రూ.50 లక్షల పెట్టుబడితో రూ.120 కోట్లకు పైగా వసూళ్లు సాధించడం సినిమా ఎలా ప్రేక్షకులను మెప్పించిందో తెలుస్తోంది. రూ.100 కోట్ల మార్క్‌ను అందుకున్న తొలి గుజరాతీ మూవీగా నిలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో ఈ మూవీ రీమేక్ కోసం ‘లాలో’పై పడ్డారు మేకర్స్. ఈ నేపథ్యంలో తెలుగు రీమేక్ హక్కుల కోసం చర్చలు జరుగుతున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. అయితే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఇప్పటివరకు నిర్మాతల నుంచి ఆఫీషియల్ అనౌన్స్  వెలువడలేదు.

ఇదిలా ఉంటే తెలుగు రీమేక్‌కు ప్రముఖ తమిళ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించే అవకాశం ఉందనే టాక్ మరింత ఆసక్తిని పెంచుతోంది. విభిన్నమైన కథలను తనదైన స్క్రీన్‌ప్లే శైలిలో చెప్పడంలో కార్తీక్ సుబ్బరాజ్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. అయితే ఈ మొత్తం ప్రాజెక్ట్‌లో ప్రస్తుతం ఎక్కువగా చర్చ జరుగుతున్న పేరు మాత్రం రామ్ చరణ్‌దే. ‘లాలో’ కథలో శ్రీకృష్ణుడి పాత్రకు కీలకమైన ప్రాధాన్యత ఉండటంతో, ఆ పాత్ర కోసం చరణ్‌ను సంప్రదించినట్లు ప్రచారం జరుగుతోంది. అలాంటి పాత్రలో రామ్ చరణ్ కనిపిస్తే అది సినిమాకు క్రేజ్ తీసుకురావడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఇప్పటికే చరణ్‌కు గ్లోబల్ స్టార్‌గా భారీ క్రేజ్ ఉంది. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత ఆయనకు దేశవ్యాప్తంగా మాత్రమే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా గుర్తింపు పెరిగింది. ఈ నేపథ్యంలో ఒక ఆధ్యాత్మిక నేపథ్యంతో కూడిన కథలో శ్రీకృష్ణుడి పాత్రలో చరణ్ కనిపిస్తారనే ప్రచారం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. గతంలో ‘గోపాల గోపాల’ సినిమాలో పవన్ కళ్యాణ్ కృష్ణుడి పాత్రలో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు అదే తరహాలో మెగా కుటుంబానికి చెందిన రామ్ చరణ్ కృష్ణుడిగా కనిపిస్తారనే వార్త రావడంతో మెగా అభిమానుల్లో కూడా ఆసక్తి మొదలైంది. మరోవైపు ఈ సినిమాలోని ప్రధాన పాత్ర కోసం సత్యదేవ్ వంటి నటుడిని సంప్రదిస్తున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది.

అయితే తెలుగు రీమేక్‌కు సంబంధించి ప్రస్తుతం వినిపిస్తున్న పేర్లన్నీ చర్చల దశలోనే ఉన్నాయి. రామ్ చరణ్, కార్తీక్ సుబ్బరాజ్, సత్యదేవ్ పేర్లపై ఎలాంటి అధికారిక ధృవీకరణ రాలేదు. కాబట్టి ఈ కాంబినేషన్ ఖరారైందని ఇప్పుడే చెప్పలేం. కానీ రూ.50 లక్షలతో రూపొందిన ఓ గుజరాతీ సినిమా రూ.120 కోట్లకు పైగా వసూలు చేసి ఇప్పుడు టాలీవుడ్‌లో రీమేక్ చర్చలకు కారణం కావడం మాత్రం ఆసక్తికరమైన పరిణామమే. ఒకవేళ ఈ ప్రాజెక్ట్ నిజంగా పట్టాలెక్కి, రామ్ చరణ్ శ్రీకృష్ణుడి పాత్రలో కనిపిస్తే మాత్రం సినిమాపై అంచనాలు ఒక్కసారిగా భారీ స్థాయికి చేరుకోవడం ఖాయం. ఆధ్యాత్మికత, భావోద్వేగం, వినోదం కలిసిన కథకు చరణ్ లాంటి గ్లోబల్ స్టార్ ఇమేజ్ తోడైతే ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల్లో ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి. ప్రస్తుతం అధికారిక ప్రకటన కోసం ఎదురుచూడాల్సిందే.