కొన్నాళ్ళ క్రితం తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రామ్ చరణ్ ఓ సినిమా చేయనున్నాడన్న టాక్ తెగ చక్కర్లు కొట్టింది. అది నిజమేనని ‘మాస్టర్’ ఈవెంట్‌లో లోకేష్ క్లారిటీ ఇచ్చాడు కూడా! తాను రామ్ చరణ్‌ని కలిసి, త్వరలోనే కథ చెప్తానని అన్నాడు. అంతే, ఆ తర్వాత మళ్ళీ ఆ ప్రాజెక్ట్ ఊసే లేదు. ఇటు చరణ్ గానీ, అటు లోకేష్ గానీ ఈ ప్రాజెక్ట్ గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇంతలో చరణ్ దర్శకుడు శంకర్‌తో కమిటయ్యాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
శంకర్ సినిమా తర్వాత జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్‌లో చరణ్ ఓ సినిమాకి కమిట్ అయ్యాడు. ఆల్రెడీ ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన పనులు జోరుగా సాగుతున్నాయి. అటు, లోకేష్ కనగరాజ్ ‘విక్రమ్’ సినిమా పనుల్లో నిమగ్నమయ్యాడు. ఇది విడుదలకి ముస్తాబవుతోంది కూడా! దీని తర్వాత మరోసారి విజయ్‌తోనే ఈ దర్శకుడు జత కట్టబోతున్నాడు. ఈ సినిమా మ్యూజిక్ పనుల్ని తమన్ ప్రారంభించేశాడు. ఇలా చరణ్, లోకేష్ తమతమ ప్రాజెక్టుల్లో బిజీ అయిపోయారే తప్ప.. తమ కాంబో ఎప్పుడు ఉంటుందన్నది క్లారిటీ ఇవ్వడం లేదు.
దీంతో.. ఈ ప్రాజెక్ట్ అసలు ఉంటుందా? ఉండదా? అనే అనుమానాలు వ్యక్తమవుతోన్న తరుణంలో, ఓ క్రేజీ న్యూస్ తెరమీదకొచ్చింది. చరణ్ కోసం లోకేష్ ఓ బైలింగ్వల్ స్క్రిప్ట్ సిద్ధం చేశాడని, రీసెంట్‌గానే ఇద్దరి మధ్య స్టోరీ డిస్కషన్స్ నడిచాయని తెలిసింది. అయితే, ఈ డిస్కషన్స్ ఎక్కడి వరకు నడిచాయన్న విషయంపై క్లారిటీ రాలేదు. మరో రెండు, మూడు సిట్టింగ్స్‌లో తాడోపేడో తేలే అవకాశం ఉంది.
