మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజాగా పంచుకున్న సెల్ఫీ ఒకటి ఇంటర్నెట్ సెన్సేషన్ గా మారింది. ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఈ పిక్ లో సూర్యుడి కిరణాలు చరణ్ పై పడగా, ఆయన మరింత ప్రకాశవంతంగా కన్పిస్తున్నారు. కెమెరాకు ఫోజులిస్తూనే విటమిన్ డిని కూడా అందుకుంటున్నాడు చరణ్. ఈ పిక్ కారణంగా చరణ్ ప్రస్తుతం ట్విట్టర్‌లో ట్రెండింగ్‌లో ఉన్నాడు. ఈ పిక్ పాన్ ఇండియా మూవీ “ఆర్సీ 15” చిత్రం సెట్స్ లో తీసుకున్నాడు చెర్రీ. సోమవారం సినిమా సెకండ్ షెడ్యూల్ షూటింగ్ హైదరాబాద్ లో ప్రారంభమైంది. ఈ పిక్ తో పాటు బిగ్ బాస్ కంటెస్టెంట్ లోబో, చరణ్ కలిసి ఉన్న ఫోటో కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇటీవలే బిగ్ బాస్ హౌజ్ నుంచి బయటకు వచ్చిన లోబో చరణ్ తో కలిసి ఫోటో దిగడం చూస్తుంటే… లోబోకు మెగా ఆఫర్ ఏదైనా వచ్చిందా ? అనే అనుమానం కలుగుతోంది.
Read Also : ఆట ఆడినా ఓడినా రికార్డ్స్ లో… గెలిస్తే మాత్రమే చరిత్రలో… : “గని” టీజర్
ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వం వహించిన “రౌద్రం రణం రుధిరం” సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి చరణ్ సిద్ధంగా ఉన్నాడు. రామ్ చరణ్ “ఆర్ఆర్ఆర్”లో అల్లూరి సీతారామ రాజు పాత్రలో కనిపిస్తాడు. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ తో చరణ్ స్క్రీన్ స్పేస్ పంచుకున్నాడు. “ఆర్‌ఆర్‌ఆర్”లో అలియా భట్, అజయ్ దేవగన్ వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం చరణ్ “ఆర్సీ 15” సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.
