మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ యాక్షన్ ఎంటెర్టైనర్ “ఆర్సీ 15”. ఈ చిత్రంలో రామ్ చరణ్ తో కియారా అద్వానీ రొమాన్స్ చేయనుంది. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ సినిమాను తాత్కాలికంగా ‘ ఆర్సీ15 ‘ అనే వర్కింగ్ టైటిల్ తో పిలుస్తున్నారు. ఈ చిత్రంలో జయరామ్, అంజలి, సునీల్, నవీన్ చంద్ర కూడా ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీని తమిళం, తెలుగు, హిందీ భాషలలో ఏకకాలంలో చిత్రీకరిస్తున్నారు. కొన్ని నెలల క్రితం సినిమాను గ్రాండ్ గా లాంచ్ చేసిన మేకర్స్ అక్టోబర్ 20న రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి నవంబర్ 2న మొదటి షెడ్యూల్ పూర్తి చేశారు. పుణేలో జరిగిన ఈ షెడ్యూల్ పూర్తయిన వెంటనే చరణ్ విమానంలో బయల్దేరి నిన్న రాత్రి ముంబైలో ల్యాండ్ అయ్యారు. ఆయన ముంబై విమానాశ్రయంలో కన్పించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈరోజు చరణ్ హైదరాబాద్ చేరుకోనున్నారు.
Read Also : సెన్సార్ కి రెడీ అవుతున్న ‘భగత్ సింగ్ నగర్’
యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ పోలీస్ టర్న్డ్ పొలిటీషియన్‌గా కనిపించనున్నాడని సమాచారం. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ సినిమా తమిళం, తెలుగు, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఒక తెలుగు హీరోకి శంకర్ దర్శకత్వం వహించడం ఇదే తొలిసారి కావడం విశేషం.
