Site icon NTV Telugu

Shajan Padamsee : పెళ్లిపీటలెక్కిన రామ్ చరణ్‌ హీరోయిన్..

Shajan

Shajan

Shajan Padamsee : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌ హీరోయిన్ పెళ్లి పీటలు ఎక్కింది. రామ్ చరణ్‌ నటించిన ఆరెంజ్ సినిమా అందరికీ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా చేసిన షాజన్ పదమ్సీకి అప్పట్లో స్పెషల్ ఫాలోయింగ్ ఉండేది. ఆమె ఈ మూవీ తర్వాత హీరో రామ్ తో మసాలా సినిమా కూడా చేసింది. కాకపోతే తెలుగులో పెద్దగా ఫేమ్ రాలేదు. దాంతో యూటర్న్ తీసుకుని బాలీవుడ్ వెళ్లిపోయింది. అక్కడే కొన్ని సినిమాల్లో చేసింది. తాజాగా ఆమె పెళ్లి చేసుకున్న ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

Read Also : NTR-Neel : 2వేల మందితో ఎన్టీఆర్ భారీ యాక్షన్ సీక్వెన్స్..

ఆమె మూవీ మాక్స్ సినిమా సీఈఓ ఆశిష్ కనకియాను పెళ్లి చేసుకుంది. వీరిద్దరూ చాలా కాలంగా డేటింగ్ లో ఉన్నారు. ఓ ఫ్రెండ్ ద్వారా షాజన్ కు ఆశిష్ పరిచయం అయ్యాడు. ఆ తర్వాత ఇద్దరూ ప్రేమలో పడి చాలా కాలం పాటు రిలేషన్ లో ఉన్నారు. ఇంట్లో వారిని ఒప్పించి ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. తాజాగా ముంబైలో వీరిద్దరూ ఒక్కటయ్యారు. మూడు రోజుల పాటు వీరి పెళ్లి వేడుకలు జరిగాయి. గురువారం రాత్రి వీరి పెళ్లి జరిగింది. శనివారం రిసెప్షన్ జరగనుంది.

Read Also : Deepika Padukone : కల్కి సీక్వెల్.. దీపిక అవే కండీషన్లు..!

Exit mobile version