NTV Telugu Site icon

Game Changer: ఈ హీరోల వల్ల సంక్రాంతి నుంచి చరణ్ సినిమా తప్పుకుందా?

Game Changer

Game Changer

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఆర్ ఆర్ ఆర్ సినిమాతో గ్లోబల్ ఇమేజ్ ని సొంతం చేసుకున్నాడు. రాజమౌళి సినిమాతో వచ్చిన ఇమేజ్ ని కంటిన్యు చెయ్యాలి అంటే రాజమౌళి అంతటి దర్శకుడితోనే నెక్స్ట్ సినిమా చెయ్యాలి అని తెలిసిన చరణ్, క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ ని రంగంలోకి దించాడు. ఈ ఇద్దరి కాంబినేషన్ లో భారి బడ్జట్ తో రూపొందుతున్న సినిమా ‘గేమ్ చేంజర్’. RC 15 అనే వర్కింగ్ టైటిల్ గా సెట్స్ పైకి వెళ్లిన ఈ మూవీ టైటిల్ ని చరణ్ పుట్టిన రోజు సంధర్భంగా అనౌన్స్ చేశారు. దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీలో చరణ్ పక్కన కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న గేమ్ చేంజర్ సినిమా వచ్చే సంక్రాంతికి బాక్సాఫీస్ బరిలో నిలుస్తుందని అంతా అనుకున్నారు కానీ ఇప్పుడా పరిస్థితి కనిపించట్లేదు. చరణ్ సినిమా వాయిదా పడే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.

2024 సంక్రాంతికి ప్రభాస్ నటిస్తున్న ప్రాజెక్ట్ K, మహేశ్ బాబు నటిస్తున్న SSMB 28 సినిమాలు రిలీజ్ కానున్నాయి. జాన్ 12, 13న విడుదల కానున్న ఈ రెండు భారి బడ్జట్ సినిమాల్లో SSMB 28 సినిమాని దిల్ రాజు నైజాం, వైజాగ్ ప్రాంతాల్లో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు. సో దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్న గేమ్ చేంజర్ సినిమాని కాదని SSMB 28కి థియేటర్స్ ఇచ్చే అవకాశం లేదు. పోనీ పండగ సీజన్ కదా రెండు సినిమాలకి థియేటర్స్ డివైడ్ చేస్తారేమో అనుకుంటే ప్రభాస్ ప్రాజెక్ట్ K ఉండనే ఉంది కాబట్టి థియేటర్స్ ముగ్గురు హీరోలకి, అది కూడా భారి బడ్జట్ తో రూపొందుతున్న పాన్ ఇండియా సినిమాలకి ఈక్వల్ గా డివైడ్ చెయ్యడం అనేది జరగని పని. ఈ విషయం అర్ధం చేసుకొనే దిల్ రాజు గేమ్ చేంజర్ సినిమాని సంక్రాంతి నుంచి తప్పించి సోలో రిలీజ్ వైపు మొగ్గుచుపే అవకాశం ఉంది. గేమ్ చేంజర్ సంక్రాంతి నుంచి సైడ్ అయితే బాక్సాఫీస్ ఫైట్ మహేశ్ బాబు, ప్రభాస్ ల మధ్య మాత్రమే జరగనుంది.

Show comments