Site icon NTV Telugu

Game Changer: అంత హడావుడి చేసి.. ఇలా గాలి తీసేశారు ఏంటి గురూ!

Game Changer

Game Changer

Game Changer Second Single to Release in September: గ్లోబల్ స్టార్ గా మారిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ గేమ్ చేంజర్ సినిమా గురించి మెగా ఫ్యాన్స్ ఎంతగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా మీద ముందు నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. దానికి తగ్గట్టుగా శంకర్ డైరెక్టర్ కావడంతో పాటు దిల్ రాజు నిర్మాత కావడంతో ఈ సినిమా మీద ఎప్పుడూ స్పెషల్ ఫోకస్ ఉంటూనే వస్తోంది. ఇక ఇప్పుడు భారతీయుడు 2 సినిమాతో శంకర్ భారీ ఫ్లాప్ మూటకట్టుకోవడంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందా? అని అందరిలోనూ ఇప్పుడు ఆసక్తి పెరుగుతోంది. ఇక ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్స్ ఇవ్వడంలేదని సినిమా టీం మీద పెద్ద ఎత్తున అభిమానులు బూతులతో విరుచుకుపడుతూ ట్రెండ్స్ కూడా సృష్టించారు.

Roshan Kanakala: హేయ్ రోషన్… నువ్వేనా.. ఇలా తయారయ్యావ్ ఏంటి?

ఈ నేపథ్యంలో ఇప్పటికే సినిమాని డిసెంబర్లో రిలీజ్ చేస్తామని దిల్ రాజు ప్రకటించారు. ఇక వినాయక చవితి సందర్భంగా రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తారేమో అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న తరుణంలో సైలెంట్గా సెకండ్ సింగిల్ సెప్టెంబర్ నెలలో రిలీజ్ చేస్తున్నాం అంటూ ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్ ప్రకటించింది. దిల్ రాజు నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్. దీంతో అభిమానులు అందరూ రిలీజ్ డేట్ ఎప్పుడో చెబుతారని ఎదురు చూస్తుంటే సెకండ్ సింగిల్ అప్డేట్ ఇస్తారా అంటూ ఉసూరు మంటున్నారు. రిలీజ్ డేట్ కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తే మరీ ఇలా చేశారేంటని ప్రశ్నిస్తున్నారు. మరికొందరైతే మొత్తం మీద ఏదో ఒక అప్డేట్ అయితే ఇచ్చారు కదా అని ఆనందపడుతున్నారు.

Exit mobile version