NTV Telugu Site icon

Ram Charan Daughter: రాముడి జన్మ నక్షత్రంలోనే రామ్ చరణ్ కుమార్తె జననం!

Ram Charan Daughter Horoscope

Ram Charan Daughter Horoscope

Ram Charan Daughter Birthstar and other Details: మెగా కుటుంబంలో మాత్రమే కాదు వారి అభిమానుల ఇళ్లలో కూడా ఇప్పుడు ఒక రకమైన పండుగ వాతావ‌ర‌ణం నెల‌కొంది. మెగాస్టార్ చిరంజీవి కుమారుడు, హీరో మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్ చ‌ర‌ణ్, ఉపాస‌న దంప‌తులు త‌ల్లిదండ్రుల‌య్యారు. సోమ‌వారం రాత్రే అపోలో హాస్పిట‌ల్‌లో జాయిన్ అయిన ఉపాస‌న‌ మంగ‌ళ‌వారం తెల్ల‌వారు జామున ఒక పండంటి ఆడ‌బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చారు. తల్లీ బిడ్డ ఆరోగ్యంగా ఉన్నారని చెబుతూ హాస్పిటల్ యాజమాన్యం ఒక బులెటిన్ కూడా రిలీజ్ చేసింది. రామ్ చరణ్‌తో పాటు తల్లి శోభన కామినేని, అత్తమ్మ సురేఖ కొణిదెలతో కలిసి సోమ‌వారం సాయంత్రం అపోలో ప్రో హెల్త్ హాస్పిటల్‌‌కు ఉపాసన వెళ్లిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Prabhas: 4 సార్లు ట్రిపుల్ సెంచరీ.. ఒకే ఒక్కడు
మెగా ప్రిన్సెస్ గా చెప్పబడుతున్న రామ్ చ‌ర‌ణ్, ఉపాస‌న దంప‌తుల కుమార్తె మిధున రాశి, పునర్వసు నక్షత్రంలో జన్మించారు. మెగాస్టార్ చిరంజీవికి ఇష్టమైన దేవుడు హనుమంతుడు అని అందరికీ తెలుసు. ఆయన శ్రీరామునికి అనుంగు భక్తుడు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, రాముని జన్మ నక్షత్రం పునర్వసు కాగా అదే నక్షత్రంలో ఇప్పుడు మెగా ప్రిన్సెస్ జన్మించింది. ఇక ఇప్పటికే ఆమె జాతకం ఏమిటి? ఆమె వల్ల రామ్ చరణ్, ఉపాసన జీవితాల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి అనే విషయాల మీద సోషల్ మీడియాలో ఇప్పటికే చర్చ జరుగుతోంది.