యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “ఆర్ఆర్ఆర్”లో స్క్రీన్ షేర్ చేసుకుంటున్న విషయం తెలిసిందే. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఇద్దరు ప్రతిభావంతులై, అత్యంత సన్నిహితులైన స్టార్ హీరోలు స్వాతంత్ర్య సమరయోధులు అల్లూరి సీతారామ రాజు, కొమరం భీమ్ పాత్రలను ఇందులో పోషిస్తున్నారు, ఇది భారతీయ చలనచిత్ర పరిశ్రమలో భారీ హైప్ ఉన్న సినిమాలలో ఒకటి. మాగ్నమ్ ఓపస్ “ఆర్ఆర్ఆర్” మూవీని డివివి దానయ్య నిర్మిస్తున్నారు. సినిమా ప్రారంభమైనప్పటి నుండి ఏదో ఒక విధంగా వార్తల్లో నిలుస్తూనే ఉంది. ప్రేక్షకులు ఈ సినిమా నుంచి అప్డేట్స్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మరోవైపు తారక్, చరణ్ మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ ఎలాంటిదో చూస్తూనే ఉన్నాము. అయితే ఇటీవల తారక్ ను కొట్టేసి ఎమోషనల్ అయిపోయాడట చరణ్.
Read Also : “ఆర్సీ 15” ప్రారంభోత్సవానికే అంత ఖర్చు పెట్టేశారా !!
ఇటీవల ఒక యూట్యూబ్ ఇంటర్వ్యూలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ సుజాత “ఆర్ఆర్ఆర్” షూట్ సమయంలో జూనియర్ ఎన్టీఆర్‌ని కొరడాతో కొట్టి, రామ్ చరణ్ ఏడ్చాడని వెల్లడించింది. తారక్ కు ఆ సీన్ లో దెబ్బ తగిలిందేమో అని చరణ్ కంగారు పడ్డాడట. ఇద్దరూ మంచి స్నేహితులు కావడంతో ఆ ఆందోళనతో చరణ్ వెంటనే కన్నీళ్లు పెట్టుకున్నాడట. సుజాత ఇంకా మాట్లాడుతూ “షూటింగ్ చేస్తున్నప్పుడు రామ్ చరణ్ కాలు జారి పడిపోయాడు. కానీ ఆయన ఆపకుండా షూట్ చేస్తూనే ఉన్నాడు” అని చెప్పుకొచ్చారు. ఈ విషయం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.
“ఆర్ఆర్ఆర్”లో ఒలివియా మోరిస్, అజయ్ దేవగన్, రే స్టీవెన్సన్, అలియా భట్, అలిసన్ డూడీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇది 2021 అక్టోబర్ 13 న థియేటర్లలోకి రానుంది.
