“ఆర్సీ 15” ప్రారంభోత్సవానికే అంత ఖర్చు పెట్టేశారా !!

దిల్ రాజు తెలుగు సినిమా ఇండస్ట్రీలో విజయవంతమైన నిర్మాతలలో ఒకరు. ఆయన గతంలో విజనరీ డైరెక్టర్ శంకర్ “ఇండియన్ 2” ని నిర్మించే అవకాశాన్ని చేజిక్కించుకున్నాడు. కానీ కొన్ని కారణాల వల్ల ఈ భారీ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నాడు. ఆ తరువాత శంకర్ ఒక పాన్ ఇండియా చిత్రం కోసం దిల్ రాజును సంప్రదించాడు. తరువాత రామ్ చరణ్ హీరోగా పాన్ ఇండియా చిత్రాన్ని చేస్తున్నట్టు ప్రకటించారు. మొత్తానికి క్రేజీ కాంబో సెట్ అయ్యింది. ‘ఆర్సీ 15’ చిత్రం నిన్న గ్రాండ్ లాంచ్ అయ్యింది. పలువురు ప్రముఖులు ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ లాంచ్ కోసం దిల్ రాజు పెట్టిన ఖర్చు విషయం ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. కేవలం సినిమా ప్రారంభోత్సవానికే దిల్ రాజు ఏకంగా కోటి రూపాయలు ఖర్చు చేసినట్లు వినికిడి.

Read Also : గోపీచంద్ “అలివేలుమంగ వెంకటరమణ” డౌటే !

అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఘనంగా పూజా కార్యక్రమం జరిగింది. తారాగణం, సిబ్బంది అందరూ హైదరాబాద్‌కు వచ్చి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. వారి ఖర్చులు, హోటల్ ఛార్జీలతో పాటు గ్రాండ్ ఈవెంట్ ఖర్చులు దిల్ రాజు కోసం దాదాపు కోటి ఖర్చు పెట్టాడట. ఇక ఈ అగ్ర నిర్మాత ఈ చిత్రంపై పూర్తి నమ్మకంతో ఉన్నారు. ఈ వారం హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో నిర్మించిన భారీ సెట్‌లో షూట్ ప్రారంభమవుతుంది. ‘ఆర్సీ 15’ కూడా దిల్ రాజు 50 వ చిత్రం. అంతేకాకుండా తారాగణం, సిబ్బందిపై నిర్వహించిన ఫోటో షూట్ కోసం రూ. 25 లక్షలు భారీ మొత్తంలో ఖర్చు చేశారు. రామ్ చరణ్, కియారా అద్వానీపై పాటతో షూట్ మొదలవుతుంది. ఈ చిత్రం సంక్రాంతి 2023కు విడుదల కానుంది.

Related Articles

Latest Articles

-Advertisement-