Ram Charan: బాక్సాఫీస్ పునాదులు కదిలించిన సలార్… సీడెడ్ లో చరణ్ ని బీట్ చేయలేకపోయాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం ఆన్ లైన్ ఆఫ్ లైన్ అనే తేడా లేకుండా సలార్ హాట్ టాపిక్ అయ్యింది. సలార్ డే 1 కలెక్షన్స్ ఎంత? ఓవర్సీస్ లో ఎంత రాబట్టింది? నైజాంలో ఎంత కలెక్ట్ చేసింది? ఏ రికార్డ్ బ్రేక్ అయ్యిందని లెక్కలు వేస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. ఈ గ్యాప్ లో గేమ్ ఛేంజర్ సినిమా ట్యాగ్ ని ట్రెండ్ చేస్తూ బయటకి వచ్చారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ అభిమానులు. ఏ సెంటర్ లో అయినా మీరు రికార్డ్స్ బ్రేక్ చేసి ఉండొచ్చు, కొత్తవి క్రియేట్ చేసి ఉండొచ్చు కానీ మా రికార్డ్ మాత్రం చెక్కు చెదరలేదు అంటూ సోషల్ మీడియాలో ట్వీట్స్ చేస్తున్నారు రామ్ చరణ్ ఫ్యాన్స్. 2019 జనవరి 11న రిలీజైన వినయ విధేయ రామ సినిమా డే 1 అరవింద సమేత వీరరాఘవ సినిమా ఓపెనింగ్ డే రికార్డుని బ్రేక్ చేసి కొత్త హిస్టరీ క్రియేట్ చేసింది. నందమూరి హీరోల స్ట్రాంగ్ జోన్ అయిన సీడెడ్ లో రామ్ చరణ్ సినిమా రికార్డ్ సృష్టించడం అంటే చిన్న విషయం కాదు.
రామ్ చరణ్-బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా సీడెడ్ ఏరియాలో మొదటి రోజు దాదాపు ఏడున్నర కోట్లని రాబట్టింది. 2024 సంక్రాంతి వస్తే చరణ్ సీడెడ్ గడ్డపై బెంచ్ మార్క్ కలెక్షన్స్ ని రాబట్టి నాలుగేళ్లు అవుతుంది. ఈ నాలుగేళ్ల గ్యాప్ లో ఎన్నో సినిమాలు వచ్చాయి కానీ వినయ విధేయ రామ ఓపెనింగ్ డే సీడెడ్ రికార్డుని బ్రేక్ చేయలేకపోయాయి. ఇప్పుడు నాలుగేళ్ల తర్వాత రేపు ఈ రికార్డ్ ని సలార్ బ్రేక్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు, సినీ అభిమానులు అనుకున్నారు కానీ సలార్ సినిమాతో కూడా ప్రభాస్ వినయ విధేయ రామ సీడెడ్ ఓపెనింగ్ డే రికార్డుని బ్రేక్ చేయలేకపోయాడు. డే 1 6.45 కోట్లతో సలార్ సినిమా సీడెడ్ లో థర్డ్ ప్లేస్ తో సరిపెట్టుకుంది. సీడెడ్ డే 1 కలెక్షన్స్ విషయంలో టాప్ ప్లేస్ లో 17 కోట్లతో ఆర్ ఆర్ ఆర్ సినిమా ఉంది. నాన్-రాజమౌళి రికార్డ్స్ విషయంలో మాత్రం చరణ్ వినయ విధేయరామ మరి కొన్ని రోజుల పాటు సీడెడ్ టాప్ ప్లేస్ లోనే ఉంది.
Also Read
- NANI : నాని ఫ్యాన్స్‌కు నిరాశ.. 'బ్లడీ రోమియో' వాయిదా.. 'OG 2'పై సుజీత్ ఫోకస్
- Jo Sharma: ఇలాంటి కాన్సెప్ట్ ప్రపంచంలోనే ఎక్కడా రాలేదు.. విలన్ ఎవరో చెబితే లక్ష ఇస్తాం!
- kannada Heros : హిట్ ఎఫెక్ట్.. భారీ రెమ్యునరేషన్స్ తీసుకుంటోన్న కన్నడ హీరోలు
- NBK 111 : రొమాంటిక్ సింహం.. బాలయ్యతో బాలీవుడ్ హీరోయిన్ ఐటం సాంగ్
తాజావార్తలు
-
Watermelon Case: పుచ్చకాయ తిని నలుగురు మృతి.. ఫోరెన్సిక్ నివేదికలో షాకింగ్ నిజం..
-
TVK Vijay: విజయ్‌కు కొత్త చిక్కులు.. వాట్సాప్ మెసేజ్‌లపై వామపక్షాలు గుర్రు!
-
CM Chandrababu : బుల్లెట్ బండి.. కాలేజీ జ్ఞాపకాలు.. రాయల్ ఎన్‌ఫీల్డ్ నడపడంపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
-
US-Iran Talks: హార్ముజ్‌పై గుడ్‌న్యూస్.. ఇరాన్-యూఎస్ మధ్య కీలక చర్చలు.. ఏం నిర్ణయం తీసుకున్నారంటే..!
-
Ponnam Prabhakar : రాజకీయాల్లో హుందాతనం ముఖ్యం.. భౌతిక దాడులపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం