Site icon NTV Telugu

Leo Ram Charan Cameo: రీచ్ కోసం ఎంతకీ తెగించారు మావా… చరణ్ ‘కోబ్రా’ అంట…

Leo Ram Charan

Leo Ram Charan

విక్రమ్ సినిమాలో కమల్ హాసన్ హీరోగా నటించినా, సేతుపతి విలన్ గా నటించినా, ఫాహద్ సూపర్బ్ సపోర్టింగ్ క్యారెక్టర్ ప్లే చేసినా, లోకేష్ కనగరాజ్ టెర్రిఫిక్ మేకింగ్ తో ఆడియన్స్ ని మెస్మరైజ్ చేసినా… ఇవన్నీ క్లైమాక్స్ వరకే ఎప్పుడైతే విక్రమ్ సినిమా ఎండ్ లో ‘రోలెక్స్’ పాత్రలో సూర్య వచ్చాడో మిగిలిన సినిమా మొత్తం మర్చిపోయిన ఆడియన్స్ డ్రగ్స్ కొట్టిన మత్తులోకి వెళ్లినట్లు రోలెక్స్ మాయలోకి వెళ్లిపోయారు. రెండున్నర గంటల సినిమా ఇచ్చిన కిక్ ని సూర్య క్యామియో కేవలం అయిదు నిమిషాల్లో ఇచ్చింది. విక్రమ్ సినిమా ఆ రేంజ్ హిట్ అవ్వడానికి కారణం కూడా సూర్య క్యామియో అని కాన్ఫిడెంట్ గా చెప్పొచ్చు. ఇప్పుడు లోకేష్ కనగరాజ్, విజయ్ తో చేస్తున్న లియో సినిమాలో కూడా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో క్యామియో చేయించాడు అనే వార్త గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉంది.

రామ్ చరణ్ క్యామియో ప్లే చేయలేదనే విషయం చాలా మందికి తెలిసినా కూడా సోషల్ మీడియాలో మాత్రం నిజమనే రేంజులో ఈ న్యూస్ వైరల్ అవుతోంది. రామ్ చరణ్ పేరుని వాడుకుంటూ లియో సినిమా తెలుగులో బజ్ జనరేట్ చేస్తుంది. చరణ్ పేరే లియో సినిమాపై హైప్ క్రియేట్ చేస్తుంది. చరణ్ ఉన్నాడో లేదో తెలుసుకోవడానికి మెగా ఫ్యాన్స్ లియో సినిమా చూడడానికి మొదటిరోజు థియేటర్స్ కి వెళ్తారు. ఇది లియో కలెక్షన్స్ కి బూస్ట్ ఇచ్చే విషయమే. ఇది రూమర్ మాత్రమే అనే విషయం తెలిసినా కూడా ఫ్యాన్స్ ఎడిట్ చేస్తూ చరణ్ ఫోటోలని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. లేటెస్ట్ గా లియో మూవీ పేరుతో ఒక సోషల్ మీడియా అకౌంట్ నుంచి చరణ్ ‘కోబ్రా’గా లియో సినిమాలో నటిస్తున్నాడు అనే పోస్ట్ బయటకి వచ్చింది. వినయవిధేయ రామ సినిమా నుంచి చరణ్ లుక్ ని తీసుకోని ఈ ఫేక్ పోస్టర్ ని డిజైన్ చేసారు. ఏది ఏమైనా రీచ్ కోసం మాత్రం చరణ్ పేరుని మాత్రం లియోతో లింక్ చేసి తెగ వాడేస్తున్నారు.

Exit mobile version