Site icon NTV Telugu

బన్నీ ‘తగ్గేదే లే’… చరణ్ స్పెషల్ ట్వీట్

Pushpa

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో మూడవ చిత్రంగా తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ “పుష్ప: ది రైజ్” ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో నటిస్తున్న నటీనటులందరికీ ఈ మూవీనే ఫస్ట్ పాన్ ఇండియా మూవీ కావడం విశేషం. సినిమా విడుదల సందర్భంగా ఐకాన్ స్టార్ కు రామ్ చరణ్ ట్విట్టర్‌లో శుభాకాంక్షలు తెలిపారు. “బన్నీ ‘పుష్ఫ’ అద్భుతంగా ఉంటుంది! మీ కృషి అసమానమైనది సుకుమార్ గారూ, మీ విజన్ మైండ్ బ్లోయింగ్ గా ఉంది. ఈరోజు విడుదల అవుతున్న అద్భుతమైన ‘పుష్ప’ కోసం రష్మిక, మొత్తం టీమ్ అందరికీ శుభాకాంక్షలు” అంటూ ట్వీట్ చేశాడు రామ్ చరణ్. దీంతో మెగా అభిమానుల్లో ఉత్సాహం ఉప్పొంగిపోతోంది. ‘తగ్గేదే లే’ అంటూ అల్లు అర్జున్ కు తమ సపోర్ట్ ను మరింతగా అందిస్తున్నారు మెగా ఫ్యాన్స్.

Read Also : ‘పుష్ప’ పబ్లిక్ టాక్… ఎలా ఉందంటే ?

ఇక సౌత్, బాలీవుడ్ నుండి చాలా మంది ప్రముఖులు ఈ చిత్రానికి తమ వంతు సపోర్ట్ ను అందించడానికి సోషల్ మీడియాను వేదికగా చేసుకున్నారు. రష్మిక మందన్న కథానాయికగా దర్శకుడు సుకుమార్ రూపొందించిన సినిమాపై విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంలో ఫహద్ ఫాసిల్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం ఆంద్రప్రదేశ్‌లోని శేషాచలం హిల్స్‌లో తెరకెక్కింది. దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి స్కోర్ అందించగా, మిరోస్లావ్ కుబా బ్రోజెక్ సినిమాటోగ్రఫీ అందించారు. ఈ ప్రాజెక్ట్‌కి సీక్వెల్‌ని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఈ సినిమా రెండో భాగాన్ని 2022లో విడుదల చేయాలని భావిస్తున్నారు.

Exit mobile version