మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కొన్ని సంస్థలు, ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆ లిస్ట్‌లోకి మరో సంస్థ చేరింది. డిస్నీ+హాట్ స్టార్‌కు రామ్ చరణ్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండబోతోన్నారని సమాచారం. అయితే తాజాగా చెర్రీ చేసిన పోస్ట్ దానికి సంబంధించినదై ఉంటుందని తెలుస్తోంది. త్వరలోనే డిస్నీ+ హాట్‌స్టార్ స్ట్రీమింగ్ సర్వీస్ కు కూడా ప్రత్యేకమైన ప్రమోషనల్ బాధ్యతలు తీసుకోనున్నారట. ఇటీవల ఆ సంస్థకు సంబంధించిన ఒక యాడ్ కూడా షూట్ చేసినట్లు తెలిసిపోయింది.
ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ సువర్ణభూమి ఇన్ ఫ్రా డెవలపర్స్ సంస్థకు టాలీవుడ్ అగ్రహీరో రామ్ చరణ్ ప్రచారకర్తగా వ్యవహరించనున్నారు. ఈ మేరకు సువర్ణభూమి సంస్థతో రామ్ చరణ్ ఒప్పందం కుదుర్చుకున్నారు. భారీ సినిమాలతో బిజీగా ఉన్న రామ్ చరణ్.. వాణిజ్యపరమైన ఒప్పందాల విషయంలోనూ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.
ప్రస్తుతం చరణ్, ఎన్టీఆర్ కలిసి నటించిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా షూటింగ్ పూర్తిచేసుకొని ఉన్నారు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో అంచనాలు గట్టిగానే ఉన్నాయి. ఇక తండ్రి చిరంజీవితో కలిసి చేసిన ఆచార్య చిత్రం కూడా విడుదలకు సిద్ధమవుతోంది. రీసెంట్ గా దర్శకుడు శంకర్-చరణ్ సినిమా పూజ కార్యక్రమాలు చేసుకోగా.. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ను ప్రారంభించనున్నారు.
