Site icon NTV Telugu

‘సఖి’ కోసం చిరు కాదు చరణ్… గుడ్ లక్ కీర్తి

keerthy-suresh

కీర్తి సురేష్ హీరోయిన్ గా తెరకెక్కిన స్పోర్ట్స్ డ్రామా “గుడ్ లక్ సఖి” విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాలో కీర్తి షూటర్‌గా కనిపించబోతోంది. జగపతి బాబు, ఆది పినిశెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి నాగేష్ కుకునూర్ దర్శకత్వం వహించారు. ఈనెల 28న “గుడ్ లక్ సఖి” థియేటర్లలోకి రానుండగా, ఈరోజు సాయంత్రం 6 గంటలకు సినిమా ప్రీ రిలీజ్ జరగనుంది. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవిని ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. అయితే ఇప్పుడు చిరంజీవి స్థానాన్ని ఆయన తనయుడు రామ్ చరణ్ భర్తీ చేస్తున్నాడు. చిరంజీవికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో ఈ వేడుకకు చరణ్ గెస్ట్ గా హాజరు కాబోతున్నాడు.

Read Also : హీరో శ్రీకాంత్ కు కోవిడ్ పాజిటివ్

నిజానికి చిరంజీవి కరోనా పాజిటివ్ అని ప్రకటించగానే కీర్తి అభిమానులు నిరాశ పడ్డారు. ట్రైలర్లో చెప్పినట్టుగా ‘సఖి’ని బ్యాడ్ లక్ వెంటాడుతోంది అనుకున్నారు. ఎందుకంటే ఈ సినిమా విడుదల ఇప్పటికే చాలా ఆలస్యం అయ్యింది. పలు కారణాల వల్ల ఇప్పటికే పలుమార్లు వాయిదా పడింది. ఎట్టకేలకు విడుదలవుతుంది అనుకుంటున్న తరుణంలో చిరుకు కరోనా రావడం గమనార్హం. అయితే చిరు స్థానాన్ని చరణ్ భర్తీ చేస్తుండడం ఇప్పుడు గుడ్ న్యూస్.

Exit mobile version