టాలీవుడ్ లోని అందమైన సెలెబ్రిటీ కపుల్స్ లో రామ్ చరణ్, ఉపాసన జంట ఒకటి. చెర్రీ సినిమాలతో బిజీ, అయితే ఉపాసన కుటుంబం, బిజినెస్, సోషల్ మీడియాలో బిజీగా ఉంటుంది. యువత శరీరానికి అనుకూలమైన ఆహారం, ఆరోగ్య అలవాట్ల గురించి సోషల్ మీడియా ద్వారా అవగాహన కల్పిస్తూ ఉంటుంది. ఇక భర్త గురించి చెప్పినప్పుడల్లా రామ్ చరణ్ ను ‘మిస్టర్ సి’ అంటూ కొత్త పేరును పెట్టేసింది. ప్రస్తుతం ఫుల్ ఖుషీగా ఉన్న ఈ జంట తాజా పిక్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ పిక్ లో ఉపాసన స్కై బ్లూ కలర్ శారీలో అందంగా కన్పించగా, చరణ్ అయ్యప్ప దీక్షలో ఉండడంతో నల్లటి వస్త్రాల్లోనే ఫొటోకు ఫోజులిచ్చారు. మొత్తానికి రాయల్ లుక్ లో ఉన్న మెగా దంపతుల పిక్ ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది.
Read Also : Doctor Strange in the Multiverse of Madness : సౌదీలో బ్యాన్… ఎందుకంటే ?
ఈ పిక్ శనివారం సాయంత్రం హైదరాబాద్ లో జరిగిన “ఆచార్య” ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముందు తీసింది. “ఆచార్య” ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చెర్రీ, ఉపాసనతో పాటు చిరంజీవి, సురేఖ దంపతులు కూడా హాజరైన విషయం తెలిసిందే. కొరటాల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో మొట్టమొదటి సారిగా చిరంజీవి, ర్మ చరణ్ పూర్తి స్థాయిలో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. నిన్న ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ రాజమౌళి అతిథిగా గ్రాండ్ గా జరిగింది. ఏప్రిల్ 29న ‘ఆచార్య’ సినిమా విడుదలవుతోంది.