Site icon NTV Telugu

దీపావళి పండగ స్పెషల్.. చెర్రీ అండ్ బన్నీ ఫ్యామిలీ ఫోటో

దీపావళి పండగను స్టార్ హీరోలు అల్లు అర్జున్, రామ్‌చరణ్ ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యామిలీ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసి అభిమానులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపాడు. బన్నీ షేర్ చేసిన ఫోటోలో అంతా యంగర్ జనరేషన్ కనిపిస్తోంది. అల్లు అర్జున్-స్నేహ, రామ్‌చరణ్-ఉపాసన, నిహారిక-చైతన్య, వైష్ణవ్ తేజ్, అల్లు బాబీతో పాటు పలువురు మెగా కుటుంబసభ్యులు కనిపిస్తున్నారు. అయితే ఈ ఫొటోలో యంగ్ హీరో సాయి తేజ్ మాత్రం క‌న‌ప‌డలేదు. అతడు ఇటీవల రోడ్డుప్రమాదానికి గురి కాగా ఆసుప‌త్రిలో చికిత్స తీసుకుని, ఇంటికి వ‌చ్చిన విష‌యం తెలిసిందే. దీంతో ప్ర‌స్తుతం అతడు విశ్రాంతి తీసుకుంటున్నాడు.

Read Also: “హరిహర వీరమల్లు” షూటింగ్ రీస్టార్ట్ ఎప్పుడంటే ?

కాగా సినిమాల విషయానికి వస్తే మెగా ఫ్యామిలీ చాలా జోరు మీద ఉంది. అల్లు అర్జున్ ‘పుష్ప’ సినిమాతో బిజీగా ఉంటే… రామ్‌చరణ్ ‘ఆర్.ఆర్.ఆర్’, ‘ఆచార్య’ సినిమాలతో త్వరలో సందడి చేయనున్నాడు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అల్లు అర్జున్ ‘పుష్ప’ డిసెంబర్ 17న థియేటర్లలో విడుదల కానుంది. అటు ఆర్.ఆర్.ఆర్ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 7న, ఆచార్య మూవీ ఫిబ్రవరి 4న విడుదల కానున్నాయి.

Exit mobile version