యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత పాన్ ఇండియా సినిమాలని లైన్ లో పెట్టాడు. ప్రస్తుతం కొరటాల శివతో #NTR30 సినిమా షూటింగ్ మొదలు పెట్టడానికి సిద్దమవుతున్న తారక్, ఈ మూవీ అయిపోగానే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘NTR31’ సినిమాని స్టార్ట్ చేయనున్నాడు. అఫీషియల్ గా అనౌన్స్ అయిన ఈ రెండు సినిమాలతో పాటు ఎన్టీఆర్ ‘ఉప్పెన’ డైరెక్టర్ బుచ్చిబాబుతో ఒక సినిమా చేయనున్నాడనే వార్త చాలా కాలంగా వినిపిస్తోంది. బుచ్చిబాబు కూడా ఎన్టీఆర్ తో ఒక స్పోర్ట్స్ సినిమా చేస్తున్నట్లు బాహాటంగానే చెప్పేశాడు. ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందో తెలియదు కానీ బుచ్చిబాబు మాత్రం సెకండ్ సినిమా ఎన్టీఆర్ తోనే చేయాలని వెయిట్ చేస్తూనే ఉన్నాడు. అయితే ఫిల్మ్ నగర్ లో వస్తున్న టాక్ ని బట్టి, ఎన్టీఆర్ తో బుచ్చిబాబు చేయాలనుకున్న సినిమా ఇప్పుడు చరణ్ చేతికి వెళ్లిందంట.
ప్రస్తుతం RC15 షూటింగ్ లో ఉన్న చరణ్, ఈ మూవీ అయిపోగానే గౌతం తిన్నునూరితో ఒక సినిమా చేయాల్సి ఉంది. ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అవ్వడంతో చరణ్, RC16 ని బుచ్చిబాబుతో చేయడానికి రెడీ అవుతున్నాడట. ఎన్టీఆర్ కి చెప్పిన కథనే, బుచ్చిబాబు చరణ్ కి చెప్పి ఒప్పించాడనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. సోషల్ మీడియాలో కూడా ఈ వార్త బాగానే వినిపిస్తోంది. అఫీషియల్ గా అనౌన్స్మెంట్ వచ్చే వరకూ ఏది నిజమని చెప్పడం కష్టం కాబట్టి… కొన్ని రోజులు ఆగితే బుచ్చిబాబు నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏ హీరోతో చేస్తున్నాడు అనే విషయంలో ఒక క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.