Site icon NTV Telugu

Ram charan : ఒక్క ఫ్లాప్‌.. ఎన్టీఆర్, చరణ్ అలర్ట్..!

Rc15

Rc15

 

ఒకే ఒక్క ఫ్లాప్‌తో ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరు అలర్ట్ అయ్యారు. ట్రిపుల్ ఆర్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచినా.. ఆచార్య ఫ్లాప్ ఎఫెక్ట్ మాత్రం.. ఈ ఇద్దరి అప్ కమింగ్ ఫిల్మ్స్ పై పడింది. దాంతో ఏ ఒక్క ఛాన్స్ కూడా తీసుకోకుడదని.. చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారట. ఇప్పటికే ఎన్టీఆర్ స్వయంగా రంగంలోకి దిగగా.. ఇప్పుడు చరణ్ కూడా అలాగే చేస్తున్నాడట. ఇంతకీ చరణ్ ఏ ప్రాజెక్ట్ విషయంలో అలా చేస్తున్నాడు..?

ట్రిపుల్ ఆర్‌తో భారీ విజయాన్ని అందుకొని.. పాన్ ఇండియా స్టార్ డమ్ అందుకున్నారు ఎన్టీఆర్, రామ చరణ్. అయితే ఈ సినిమా తర్వాత ఇద్దరు కూడా ఒకే దర్శకుడితో పని చేయడం విశేషం. ఇప్పటికే కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్యలో నటించాడు చరణ్. అయితే భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా భారీ ఫ్లాప్‌ అందుకుంది. దాంతో తన నెక్ట్స్ సినిమా స్క్రిప్ట్ విషయంలో ఏ చిన్న ఛాన్స్ కూడా తీసుకోవడం లేదట. ప్రస్తుతం శంకర్ సినిమాలో నటిస్తున్నాడు చరణ్. ఈ సినిమా ఎప్పుడో మొదలైపోయింది కాబట్టి.. అప్ కమింగ్ సినిమా విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడట. శంకర్ సినిమా తరువాత ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో ఓ మూవీ చేయబోతున్నాడు చరణ్. ఈ మూవీ స్క్రిప్ట్ విషయంలో రామ్ చరణ్ అస్సలు కాంప్రమైజ్ అవడం లేదట.

 

రీసెంట్‌గా చరణ్‌ను కలిశాడట ఈ గౌతమ్ తిన్ననూరి. దాంతో కథలో కొన్ని మార్పులు చేయాల్సిందిగా సూచనలు ఇచ్చాడట చరణ్. అలాగే.. పక్కాగా ఎలాంటి లూప్ హోల్స్ లేకుండా బౌండెడ్ స్క్రిప్ట్ తో వచ్చాకే.. స్టోరీ నచ్చాకే ఫైనల్ చేస్తానని చెప్పాడట. దీంతో ప్రస్తుతం గౌతమ్ ఫుల్ స్క్రిప్ట్‌ని పక్కాగా పూర్తి చేసే పనిలో వున్నారట. ఇక ఎన్టీఆర్‌ కూడా ట్రిపుల్ ఆర్ తర్వాత కొరటాలతో ఓ సినిమా చేస్తున్నారు. దాంతో ఆచార్య రిజల్ట్ ఎన్టీఆర్ 30 ప్రాజెక్ట్‌ను కాస్త పరేషాన్ చేస్తోంది. అందుకే కొరటాలతో కూర్చొని స్క్రిప్టుకి తుది మెరుగులు దిద్దే పనిలో ఉన్నాడట యంగ్ టైగర్. ఇలా ట్రిపుల్ ఆర్ హీరోల పై ఆచార్య ఎఫెక్ట్ భారీగానే పడిందని చెప్పొచ్చు. మరి అప్ కమింగ్ సినిమాలతో ఎన్టీఆర్, చరణ్ ఎలాంటి హిట్స్ అందుకుంటారో చూడాలి.

Exit mobile version