Site icon NTV Telugu

‘రామ్ – అసుర్’ గా మారిన ‘పీనట్ డైమండ్’!

అభిన‌వ్ స‌ర్ధార్‌, రామ్ కార్తిక్, చాందిని త‌మిళ్‌రాస‌న్‌, షాని సాల్మాన్‌‌, షెర్రి అగర్వాల్ ప్రధాన పాత్రలు పోషించిన సినిమా ‘పీనట్ డైమండ్’. అభినవ్ సర్దార్ తో కలిసి దర్శకుడు వెంకటేశ్ త్రిపర్ణ ఈ సినిమాను నిర్మించాడు. అయితే ‘పీనట్ డైమండ్’ అనే పేరు మాస్ ఆడియెన్స్ కు రీచ్ కాదనే ఉద్దేశ్యంతో ఈ మూవీ టైటిల్ ను ఇప్పుడు ‘రామ్ – అసుర్’గా మార్చారు. సైన్స్ ఫిక్ష‌న్, యాక్ష‌న్ డ్రామాగా తెర‌కెక్కుతోన్న ఈ మూవీకి భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని సమకూర్చగా, సినిమాటోగ్రఫీని జె. ప్రభాకరరెడ్డి అందించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదల సిద్దంగా ఉన్న ఈ మూవీ నయా టైటిల్ పోస్టర్ ను ఫిల్మ్ ఛాంబర్ లో రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి, ఇన్ కమ్ టాక్స్ అడిషనల్ కమీషనరీ జీవన్ లాల్ ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు.

చిత్ర దర్శక, నిర్మాత వెంక‌టేష్ త్రిప‌ర్ణ మాట్లాడుతూ, ”ఈ మూవీని  ఓటీటీలో విడుదల చేయాలనుకొని ‘పీనట్ డైమండ్’ అనే ఇంగ్లీష్ టైటిల్ పెట్టాం. కానీ మూవీ మేకింగ్ ప్రాసెస్ లో విజువల్స్ ఎక్స్ టార్డినరీగా, గ్రాండ్ గా వచ్చాయి. దాంతో వెల్ విషర్స్ సలహా మేరకు కరోనా సెకండ్ వేవ్ తగ్గిన తర్వాత థియేటర్లలో విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చాం. అందుకే అందరికీ రీచ్ కావాలని మూవీ పేరును ‘రామ్ – అసుర్’ అని మార్చాం. ఓ కొత్త ఓటీటీ ప్లాట్ ఫామ్ నుండి భారీ ఆఫర్ వచ్చినా కాదని, నవంబర్ 19న థియేటర్లలో విడుదల చేయబోతున్నాం” అని అన్నారు. ఇంతవరకూ ఎవరూ టచ్ చేయని పాయింట్ తో, ఎక్కడా రాజీపడకుండా ఈ సినిమాను తీశామని, సుమన్, ‘శుభలేఖ’ సుధాకర్ వంటి సీనియర్స్ నటించడంతో ఈ సినిమా వాల్యూ పెరిగిందని నటుడు, నిర్మాతల్లో ఒకరైన అభినవ్ సర్దార్ తెలిపాడు.

Exit mobile version