NTV Telugu Site icon

Rakul Preet Singh : ఆ బట్టలు ధరించాలంటే లక్ష రూపాయల వరకు ఖర్చు పెట్టాలి..

Rakul Prethising

Rakul Prethising

అనతి కాలంలోనే టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది రకుల్ ప్రీత్ సింగ్ . దాదాపు అందరు స్టార్ హీరోలతో జత కట్టిన ఈ చిన్నది తన అందం నటనతో తెలుగులో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ప్రజంట్ తమిళ, హింది భాషలో వరుస సినిమాలు తీస్తూ దూసుకుపోతుంది రకుల్. అయితే మనకు తెలిసి హీరోలు హీరోయిన్‌లు ధరించే బట్టలు చాలా ఖరీదైనవి ఉంటాయి. వారి బ్యాగ్, వాచ్ లు లక్షల్లో .. కోట్ల లో ఉంటాయి. అయితే తాజాగా ఈ విషయంపై రకుల్ ఇంట్రెస్టింగ్ విషయాలు బయట పెట్టింది.

Also Read: Navdeep : కొత్త వ్యాపారం మొదలు పెట్టిన నవదీప్..సపోర్ట్‌గా మంచు లక్ష్మీ

‘మేము ఇంత అందంగా కనిపిస్తున్నాము అంటే దానికి కారణం మా టీమ్. ఎప్పుడంటే అప్పుడు ఎక్కడికంటే అక్కడికి మా చూటు తిరుగుతూ ఉంటారు. మేకప్ వేసేందుకు, డ్రెస్‌కు తగినట్లుగా హెయిర్ స్టైల్ చేసేందుకు ఇలా మా కంటూ ఒక టీమ్ ఉంటుంది. నా టీమ్ మాత్రం గత ఆరు ఏళ్లుగా నాతోనే ఉంది. వారిని నాకు కుటుంబ సభ్యుల్లాగే చూస్తాను. అయితే రెడ్ కార్పెట్ పై,ఈవెంట్ల కోసం డిజైనర్లు మాకు ఉచితంగా దుస్తులు పంపిస్తారు దీని వల్ల మాకు పైసా ఖర్చు ఉండదని అనుకుంటారు. కానీ అది నిజం కాదు. వాళ్లు ఫ్రీగానే ఇచ్చినా దాన్ని తెచ్చిన వారికి ఆ డ్రెస్‌కు తగిన విధంగా మమ్మల్ని అందంగా రెడీ చేసే స్టైలిష్ట్ లకు డబ్బులు ఇవ్వాలి. వారి డ్రెస్ తగ్గ లుక్ కోసం 20,000 రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు తీసుకుంటారు. అంతేకాదు కొరియర్ ఛార్జీలు సైతం అందులోనే ఛార్జ్ చేస్తారు. అంతర్జాతీయ డిజైనర్ రూపొందించిన డ్రెస్ ధరించాలంటే భారీగా ఖర్చు చేయాల్సి ఉంటుంది’ అని రకుల్ ప్రీత్ సింగ్ వెల్లడించారు.