Site icon NTV Telugu

రకుల్ కి అవకాశాలు లేవా.. మరీ ఇలా అడుగుతుందేంటీ…?

rakul

rakul

సినిమా ఒక రంగుల ప్రపంచం. ఈ ఫీల్డ్ లో గ్లామర్ ఉన్ననిరోజులు మాత్రమే ఉండగలరు హీరోయిన్లు. టాలీవుడ్ లో దశాబ్ద కాలంగా స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతున్నవారిలో రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఉంది. అందం, అభినయం కలబోసినా ఈ ముద్దుగుమ్మకు ప్రస్తుతం ఆఫర్లు లేవని తెలుస్తోంది. అదేంటి స్టార్ హీరోల సరసన నటించింది.. ఇటీవలే బాలీవుడ్ లోను అడుగుపెట్టి హిట్స్ అందుకున్న రకుల్ కి అవకాశాలు లేవు అంటారేంటి.. అనే అనుమానం రావచ్చు. అయితే ఈ విషయాన్ని రకుల్ ఇన్ డైరెక్ట్ గా చెప్పడాఖ్ముతో ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల్ రకుల్ ఒక జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకు అవకాశం ఇవ్వాల్సిందిగా డైరెక్టర్లను కోరింది.

“తెలుగుతో పాటు తమిళం మరియు హిందీలో మాట్లాడగలను.. పలు భాషల్లో నటించిన అనుభవం ఉంది. కనుక నాకు పాన్ ఇండియా సినిమాల్లో అవకాశాలు ఇవ్వాలంటూ” ఆమె విజ్ఞప్తి చేసింది. దీంతో రకుల్ కి ఇప్పుడు అవసఖాలు లేవు అనే విషయం స్పష్టమయింది. రకుల్ ప్రీత్ సింగ్ కెరీర్ ఆరంభించి దాదాపుగా పదేళ్లు అవుతుంది. ఈ పదేళ్లలో అమ్మడు ఏనాడు ఇలా అడిగింది లేదు.. తనదగగ్రకు వచ్చిన అవకాశాలనే అందిపుచ్చుకొని స్టార్ హీరోయిన్ గా మారింది. అలాంటి రకుల్ ఇప్పుడు అవకాశాలు కావాలి అని అనడం విడ్డూరంగా ఉంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి రకుల్ రిక్వెస్ట్ కి డైరెక్టర్ల మనసు కరిగి అవకాశాలు ఇస్తారేమో చూడాలి.

Exit mobile version