NTV Telugu Site icon

ప్రియుడితో పెళ్లి… రకుల్ షాకింగ్ రియాక్షన్

rakul

పంజాబీ భామ రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్ కు చెందిన జాకీ భగ్నాని అనే వ్యక్తితో ప్రేమలో పడిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని స్వయంగా రకుల్ ప్రీత్ సింగ్ వెల్లడించింది. ఆమె అలా ప్రకటించినప్పటి నుంచి వీరిద్దరి పెళ్లి ఎప్పుడు జరుగుతుందా ? అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు సినీ ప్రేక్షకులు. ఆ మేరకు రూమర్స్ కూడా మొదలయ్యాయి. గతంలో ఓసారి రూమర్స్ పై స్పందించిన రకుల్ తన పెళ్లి విషయాన్నీ తానే ప్రకటిస్తానని అందరి నోళ్లు మూయించింది. అయితే ఇటీవల కాలంలో స్టార్ హీరోయిన్లంతా పెళ్లి బాట పడుతుంటే రకుల్ పెళ్లి విషయం గురించి కూడా చర్చ మొదలైంది. ఇప్పుడు ప్రియుడితో రకుల్ పెళ్లి గురించి ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ పుకార్లపై స్పందించిన రకుల్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో అసలు పెళ్లి గనుక జరిగితే దాని గురించి మాట్లాడే మొదటి వ్యక్తి తానే అని చెప్పింది.

Read Also : “పుష్ప”పై మహేష్ సెన్సేషనల్ రివ్యూ

పెళ్లి గురించిన ఊహాగానాలు బాధిస్తున్నాయా ? అనే ప్రశ్నకు రకుల్ స్పందిస్తూ “అది పెళ్లి కావచ్చు లేదా లేనిపోని నాన్సెన్స్ గురించి మరేదైనా పుకార్లు కావచ్చు, అది ఏమైనా నన్ను అస్సలు ఇబ్బంది పెట్టలేవు. నేను ఇవన్నీ పట్టించుకోను. పని చేస్తూనే ఉండడం నేర్చుకున్నా. నేను నా జీవితంలో పారదర్శకంగా ఉన్నాను. ఆ దశ వచ్చినప్పుడు ఎప్పటిలాగే దాని గురించి మాట్లాడే మొదటి వ్యక్తిని నేనే” అంటూ సమాధానం ఇచ్చింది. నిజం బయటకు వచ్చే వరకు ప్రజలు వేచి చూడాలని ఆమె అన్నారు. ప్రస్తుతం తన దృష్టి అంతా చేతిలో ఉన్న 10 చిత్రాలతో సహా పని పైనే ఉందని రకుల్ తెలిపింది. మిగిలినవన్నీ అనుకున్న సమయానికి జరుగుతాయి అని రకుల్‌ చెప్పింది. ఇక రకుల్ ప్రీత్ సినిమాల విషయానికొస్తే… ‘డాక్టర్ జి’లో ఆయుష్మాన్ ఖురానాతో స్క్రీన్ స్పేస్‌ను పంచుకుంటుంది. ‘రన్‌వే 34’లో అజయ్ దేవగన్, అమితాబ్ బచ్చన్‌లతో కలిసి నటిస్తోంది. అజయ్ దేవగణ్, సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి ‘థాంక్ గాడ్‌’లో కూడా కనిపించనుంది.