ప్రియుడితో పెళ్లి… రకుల్ షాకింగ్ రియాక్షన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పంజాబీ భామ రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్ కు చెందిన జాకీ భగ్నాని అనే వ్యక్తితో ప్రేమలో పడిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని స్వయంగా రకుల్ ప్రీత్ సింగ్ వెల్లడించింది. ఆమె అలా ప్రకటించినప్పటి నుంచి వీరిద్దరి పెళ్లి ఎప్పుడు జరుగుతుందా ? అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు సినీ ప్రేక్షకులు. ఆ మేరకు రూమర్స్ కూడా మొదలయ్యాయి. గతంలో ఓసారి రూమర్స్ పై స్పందించిన రకుల్ తన పెళ్లి విషయాన్నీ తానే ప్రకటిస్తానని అందరి నోళ్లు మూయించింది. అయితే ఇటీవల కాలంలో స్టార్ హీరోయిన్లంతా పెళ్లి బాట పడుతుంటే రకుల్ పెళ్లి విషయం గురించి కూడా చర్చ మొదలైంది. ఇప్పుడు ప్రియుడితో రకుల్ పెళ్లి గురించి ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ పుకార్లపై స్పందించిన రకుల్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో అసలు పెళ్లి గనుక జరిగితే దాని గురించి మాట్లాడే మొదటి వ్యక్తి తానే అని చెప్పింది.
Read Also : “పుష్ప”పై మహేష్ సెన్సేషనల్ రివ్యూ
Also Read
- Jailer 2 Ticket Price Hike: ఏపీలో 'జైలర్ 2' టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
- The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. 'ది ప్యారడైజ్' ఓటీటీలో ఊహించని మార్పులు!
- RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
- Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ 'బిగ్ రిస్క్'!
పెళ్లి గురించిన ఊహాగానాలు బాధిస్తున్నాయా ? అనే ప్రశ్నకు రకుల్ స్పందిస్తూ “అది పెళ్లి కావచ్చు లేదా లేనిపోని నాన్సెన్స్ గురించి మరేదైనా పుకార్లు కావచ్చు, అది ఏమైనా నన్ను అస్సలు ఇబ్బంది పెట్టలేవు. నేను ఇవన్నీ పట్టించుకోను. పని చేస్తూనే ఉండడం నేర్చుకున్నా. నేను నా జీవితంలో పారదర్శకంగా ఉన్నాను. ఆ దశ వచ్చినప్పుడు ఎప్పటిలాగే దాని గురించి మాట్లాడే మొదటి వ్యక్తిని నేనే” అంటూ సమాధానం ఇచ్చింది. నిజం బయటకు వచ్చే వరకు ప్రజలు వేచి చూడాలని ఆమె అన్నారు. ప్రస్తుతం తన దృష్టి అంతా చేతిలో ఉన్న 10 చిత్రాలతో సహా పని పైనే ఉందని రకుల్ తెలిపింది. మిగిలినవన్నీ అనుకున్న సమయానికి జరుగుతాయి అని రకుల్ చెప్పింది. ఇక రకుల్ ప్రీత్ సినిమాల విషయానికొస్తే… ‘డాక్టర్ జి’లో ఆయుష్మాన్ ఖురానాతో స్క్రీన్ స్పేస్‌ను పంచుకుంటుంది. ‘రన్‌వే 34’లో అజయ్ దేవగన్, అమితాబ్ బచ్చన్‌లతో కలిసి నటిస్తోంది. అజయ్ దేవగణ్, సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి ‘థాంక్ గాడ్’లో కూడా కనిపించనుంది.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు