“పుష్ప”పై మహేష్ బాబు సెన్సేషనల్ రివ్యూ

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన మొట్టమొదటి పాన్ ఇండియా మూవీ “పుష్ప : ది రైజ్” ఇప్పటికే అనేక రికార్డులను బద్దలు కొట్టింది. మరిన్ని రికార్డులను బద్దలు కొట్టడానికి రెడీ అవుతోంది. అల్లు అర్జున్, రష్మిక మందన్న నటించిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుని దూసుకెళ్తోంది. గత వారం ఈ మూవీ రోహిత్ శెట్టి దర్శకత్వం వహించిన ‘సూర్యవంశీ’ని సైతం అధిగమించి భారతదేశంలో 2021లో బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచింది. తాజాగా ఈ సినిమాపై సూపర్ స్టార్ మహేష్ బాబు రివ్యూ ఇచ్చారు. నిన్న సినిమాను వీక్షించిన మహేష్ బాబు సినిమాపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. “అల్లు అర్జున్ ‘పుష్ప’ అద్భుతం, సెన్సేషనల్ అండ్ ఒరిజినల్… సుకుమార్ తన సినిమా రా, రిస్టిక్, బ్రూటల్లీ హొనెస్ట్ అని మళ్ళీ నిరూపించారు” అంటూ ‘పుష్ప’పై ప్రశంసల వర్షం కురిపించారు మహేష్.

Read Also : మరో మైలురాయిని దాటిన మెగా పవర్ స్టార్

ఇక అల్లు అర్జున్ ‘పుష్ప’తో ఈ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. బాలీవుడ్ లో బన్నీ స్టైల్ కు ఫిదా అవుతున్నారు ప్రేక్షకులు. ప్రస్తుతానికి ‘పుష్ప’ చిత్రం హిట్ ను ఎంజాయ్ చేస్తున్న బన్నీ విశ్రాంతి తీసుకుంటున్నాడు. మార్చి నెల నుంచి ‘పుష్ప 2’ని స్టార్ట్ చేయనున్నాడని సమాచారం. ఇప్పుడు బన్నీ తనకు బాలీవుడ్ స్క్రిప్ట్‌లను చదివే పనిలో బిజీగా ఉన్నాడని తెలుస్తోంది. ఇప్పటికే తనకు నచ్చని కొన్ని ప్రాజెక్ట్స్‌ని తిరస్కరించాడట. ఇప్పుడు బన్నీ హిందీ, తెలుగు భాషల్లో కమర్షియల్ చిత్రాలే చేయాలని భావిస్తున్నాడట.

Related Articles

Latest Articles