Site icon NTV Telugu

బాయ్ ఫ్రెండ్ ను పరిచయం చేసిన రకుల్… బర్త్ డే సర్ప్రైజ్ షాక్!!

Rakul Preet Singh makes her relationship with Jackky Bhagnani official

పంజాబీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ పుట్టినరోజు నేడు. అయితే పుట్టినరోజు నాడు తన అభిమానులకు షాక్ తో కూడిన సర్ప్రైజ్ ఇచ్చింది ఈ భామ. సోషల్ మీడియా వేదికగా ఏకంగా బాయ్ ఫ్రెండ్ నే పరిచయం చేసింది. ఇన్ని రోజులూ సినిమాలతో వార్తల్లో నిలిచిన రకుల్ ఇప్పుడు మాత్రం బాయ్ ఫ్రెండ్ ని పరిచయం చేసి వార్తల్లో నిలిచింది. నిజానికి ఆమెను ఆరాధించే కొంతమంది అభిమానులకు ఇది హార్ట్ బ్రేకింగ్ న్యూస్ అని చెప్పొచ్చు. మరికొంత మంది మాత్రం ఈ సందర్భంగా ఆమెకు విషెస్ చెబుతూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Read Also : మీడియాకి మంచి మెటీరియల్ దొరికింది కదా… చిరంజీవి సెటైర్

రకుల్ ఈరోజు నటుడు, నిర్మాత జాకీ భగ్నానితో తన రిలేషన్ ను బయటపెట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఆయనతో కలిసి ఉన్న పిక్ ను షేర్ చేసుకోవడమే కాకుండా జాకీ కోసం ఒక స్వీట్ నోట్ కూడా రాసుకొచ్చింది. ఈ సంవత్సరం తనకు ఆయన ‘అతి పెద్ద బహుమతి’ అంటూ జాకీపై ప్రేమను కురిపించేసింది రకుల్. “థాంక్యూ నా మై లవ్ ! మీరు ఈ సంవత్సరం నా అతిపెద్ద బహుమతి! నా జీవితానికి రంగులు జోడించినందుకు, నన్ను నిరంతరం నవ్వించినందుకు ధన్యవాదాలు” అంటూ పోస్ట్ చేసింది. జాకీ కూడా అదే ఫోటోను షేర్ చేసి “నువ్వు లేని రోజులు రోజుల్లా ఉండవు. నువ్వు లేకుండా డెలీషియస్ ఫుడ్ తినడం నో ఫన్. నా ప్రపంచమైన అందమైన ఆత్మకు పుట్టినరోజు శుభాకాంక్షలు” అంటూ ప్రత్యేకంగా పుట్టినరోజూ శుభాకాంక్షలు తెలిపారు. ఇదిలా ఉంటే రకుల్ త్వరలో జాకీ నిర్మిస్తున్న ఓ చిత్రంలో అక్షయ్ కుమార్‌తో కలిసి కనిపించనుంది.

Exit mobile version