Site icon NTV Telugu

Rakul: మళ్లీ మొదలైన రకుల్ పెళ్లి లొల్లి… కారణం ఆ రిసెప్షనే

Rakul

Rakul

వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాతో హీరోయిన్ గా తెలుగు ఆడియన్స్ ని పలకరించింది రకుల్ ప్రీత్ సింగ్. అతి తక్కువ  సమయంలో స్టార్ స్టేటస్ తెచ్చుకున్న ఈ పంజాబీ బ్యూటీ కొంతకాలం క్రితం తన ప్రియుడిని పరిచయం చేసిన విషయం తెలిసిందే. బాలీవుడ్ నటుడు, నిర్మాత జాకీ భగ్నానితో రిలేషన్ లో ఉన్నట్లు రకుల్ అఫీషియల్ గా చెప్పేసింది. ఎప్పుడైతే రకుల్ అనౌన్స్ చేసిందో అప్పటినుంచి, ఊ అంటే చాలు రాకుల్-భగ్నాని కలిసి కనిపిస్తే చాలు త్వరలో పెళ్లి, డేట్ ఫిక్స్ అయ్యింది, అనౌన్స్మెంట్ వస్తుంది, ఇదిగో పెళ్లి డేట్ వచ్చేసింది అంటూ సోషల్ మీడియాలో డిస్కషన్ మొదలయ్యింది. సంవత్సరలు గడుస్తున్నాయి కానీ సోషల్ మీడియా ప్రిడిక్షన్ నిజమయ్యి రకుల్ ప్రీత్ పెళ్లి మాత్రం కావట్లేదు. నా పెళ్లి డేట్ నేనే చెప్తాను అని రకుల్ ఓపెన్ గానే చెప్పినా, పాపం ఎవరు వినట్లేదు. తనకే తెలియకుండా తన పెళ్లి డేట్ ని ఫిక్స్ చేసి సోషల్ మీడియాలో అనౌన్స్ కూడా చేస్తున్నారు.

ఈ మధ్య కాలంలో ఇలాంటి వార్తలు కాస్త తగ్గాయి. తాజాగా మరోసారి రాకుల్ ట్విట్టర్ లో హాట్ టాపిక్ అయ్యింది. రీసెంట్ గా జరిగిన కియారా, సిద్దార్థ్ మల్హోత్రాల రిసెప్షన్ కి రకుల్ ప్రీత్ సింగ్-జాకీ భగ్నాని కలిసి వచ్చారు. ఈ సమయంలో కెమెరాలు క్లిక్ మనడంతో, నెట్ లో ఈ ప్రేమ జంట ఫోటోలు వైరల్ అయ్యాయి. దీంతో మరోసారి రకుల్ పెళ్లి డేట్ ఇదిగో, త్వరలో చెప్పేస్తుంది అనే గాలి వార్తలు మళ్లీ మొదలయ్యాయి. ఇక రకుల్ సినిమాల విషయానికొస్తే… హిందీలో ఎదో ఒక సినిమా చేస్తూనే ఉంది కానీ రకుల్ తెలుగులో మాత్రం సినిమాలు చెయ్యట్లేదు. కథ నచ్చట్లేదో లేక మేకర్స్ రకుల్ కెరీర్ సౌత్ లో ఎండ్ అయ్యింది అని భావిస్తున్నారో కానీ రకుల్ నుంచి మాత్రం తెలుగులో సినిమాలు రావట్లేదు.

Exit mobile version