యంగ్ హీరో రక్షిత్ అట్లూరి హీరోగా గోదావరి నేపథ్యంలో లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘శశివదనే’. సాయి మోహన్ ఉబ్బన దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని గౌరీ నాయుడు సమర్పణలో అహితేజ బెల్లంకొండ నిర్మిస్తున్నారు. కోమలిప్రసాద్ హీరోయిన్ గా నటిస్తుండగా, సంగీత దర్శకుడు, నటుడు రఘు కుంచె, శ్రీమాన్, దీపక్ ప్రిన్స్, ‘రంగస్థలం’ మహేష్ ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు.
శనివారం చిత్ర కథానాయకుడు రక్షిత్ అట్లూరి బర్త్ డే ను పురస్కరించుకొని చిత్ర యూనిట్ హీరో ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేసింది. ఈ సందర్బంగా నిర్మాత మాట్లాడుతూ, ”సాయి మోహన్ ఉబ్బన ఈ సినిమాను చాలా గ్రాండియర్‌గా, హై స్టాండర్డ్స్‌లో తెరకెక్కిస్తున్నారు. అలాగే ఈ చిత్రానికి మ్యూజిక్, విజువల్స్ హైలైట్ గా నిలుస్తాయి. ఇందులో ఉన్న ఐదు పాటలు అద్భుతంగా వచ్చాయి. నటీ, నటులు సాంకేతిక నిపుణులు అందరూ సపోర్ట్ చేయడంతో ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.ఇప్పటివరకు తీసిన సన్నివేశాలు చూసుకున్నాం చాలా బాగా వచ్చాయి. మేమంతా చాలా హ్యాపీగా ఉన్నాం. ప్రస్తుతం ఫైనల్ షెడ్యూల్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని దసరాకు విడుదల చేయాలనుకుంటున్నాం” అని అన్నారు. శరవణ వాసుదేవన్ సంగీతాన్ని సమకూర్చుతున్న ఈ చిత్రానికి శ్రీపాల్ చొల్లేటి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు.
