Site icon NTV Telugu

Rakhi Sawant: అనంత్ అంబానీ బరువుపై బాలీవుడ్ నటి సంచలన వ్యాఖ్యలు..

Rakhi

Rakhi

Rakhi Sawanth: బాలీవుడ్ హాట్ బ్యూటీ రాఖీ సావంత్ గురించి ప్రత్యేకంగా పరిచయ వ్యాక్యాలు చెప్పనవసరం లేదు. ఆమె చేసిన రచ్చ.. ఇరుకున్న వివాదాలు అంతా ఇంతా కాదు. ఎవరు ఏం అనుకుంటే నాకేంటి.. నాకు నచ్చినట్లు నేను ఉంటాను అంటూ మీడియా ముందు ఆమె చేసిన హంగామా గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఇక అమ్మడి నోరుకు కొన్నిసార్లు హద్దు అదుపు ఉండదు. ఎన్నోసార్లు ఇలానే నోటికి ఎంత వస్తే అంత మాట్లాడి వివాదాలను కొనితెచ్చుకుంటూ ఉంటుంది. తాజాగా ఈ హాట్ బ్యూటీ.. ఏకంగా అనంత్ అంబానీపైనే అసభ్యకరమైన కామెంట్స్ చేసింది. ముకేశ్ అంబానీ.. తన కొడుకు పెళ్ళికి తనను పిలవలేదని అక్కసు వెళ్లగక్కింది. ఆ కోపాన్ని అంతా వీడియో రూపంలో బయటపెట్టింది. ఎవరిని అంటున్నాం.. ఏం అంటున్నాం అనే స్పృహ కూడా లేకుండా మాట్లాడి నెటిజన్స్ చేత తిట్టించుకుంటుంది.

” ముకేశ్ అంబానీ.. నన్నెందుకు అనంత్ అంబానీ పెళ్ళికి ఆహ్వానించలేదు. కేవలం నాకు రూ. 10 కోట్లు ఇచ్చి ఉంటే .. పెళ్లి మొత్తం నేనే చూసుకునేదాన్ని. సెలబ్రిటీల వంటపాత్రలను కడగడం దగ్గర నుంచి వారి రూమ్స్ ను కూడా క్లీన్ చేసేదాన్ని. అసలు మీరు నా డ్యాన్స్ చూడలేదేమో.. మున్నీ బద్నామ్ హుయ్ డార్లింగ్ తేరే లియే, తుక్ తుక్ దేఖే, పరదేశియా ఇలా చాలా పాటలు చేశాను. మీ పెళ్లి వేడుకలో మీరు చేసిన డ్యాన్స్ నా ముందు జుజుబీ. నన్ను పిలిచే ఉంటే స్టేజిని షేక్ ఆడించేదాన్ని. రిహాన్నా ను కోట్లు కోట్లు పోసి పిలిపించారు. ఆమె ఏమో చిరిగిన డ్రెస్ వేసుకొని వచ్చింది” అని చెప్పుకొచ్చింది.

ఇక అనంత్ అంబానీ గురించి మాట్లాడుతూ.. ” డియర్ అంబానీ.. అనంత్ బాగా బరువు పెరిగాడు. నా దగ్గరకు పంపండి. 5 రోజుల్లో అతని బరువును నేను తగ్గిస్తాను. అతన్ని తృప్తి పర్చడమే కాకుండా బరువు తగ్గేలా చూస్తాను. దానికోసం కొంత డబ్బు నాకివ్వండి. అనంత్ ను జీరో సైజ్ కు తెప్పించే బాధ్యత నాది.అసలే మీ కోడలు దానిమ్మ పండులా ఉంటుంది. అనంత్ తగ్గితే ఆమెకే కదా మంచిది” అంటూ చెప్పుకొచ్చింది. ఇక రాఖీ వ్యాఖ్యలు పై నెటిజన్స్ దుమ్మెత్తిపోస్తున్నారు. అనారొగ్య కారణాల వలన అనంత్ లావు అయ్యాడని, ఇలా మాట్లాడడానికి సిగ్గుగా లేదా.. ? అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Exit mobile version