NTV Telugu Site icon

Rakesh Master Death: బిగ్ బ్రేకింగ్.. ప్రముఖ కొరియో గ్రాఫర్ రాకేష్ మాస్టర్ మృతి

Rakesh Master

Rakesh Master

Rakesh Master: చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ కొరియో గ్రాఫర్ రాకేష్ మాస్టర్(53) మృతి చెందారు. గత కొంతకాలంగా రాకేష్ మాస్టర్ అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెల్సిందే. అయితే తాజాగా విజయనగరం నుంచి వస్తుండగా రాకేష్ మాస్టర్ కు సన్ స్ట్రోక్ వచ్చినట్లు తెలుస్తోంది. దానివలన రక్త విరోచనాలు కావడంతో వెంటనే ఆయనను చికిత్స నిమిత్తం గాంధీ హాస్పిటల్ తరలించగా.. చికిత్స పొందుతూ రాకేష్ మాస్టర్ కన్నుమూశారు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ గా మారింది. ఇక సోషల్ మీడియా వాడేవారికి రాకేష్ మాస్టర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆట డ్యాన్స్ షోతో రాకేష్ మాస్టర్ తన కెరీర్ ను డ్యాన్సర్ గా మొదలుపెట్టారు. అక్కడ నుంచి డ్యాన్స్ మాస్టర్ గా.. దాదాపు 1500 సినిమాలకు పనిచేశారు. ఇక గత కొంతకాలంగా రాకేష్ మాస్టర్ సినిమాలకు దూరంగా ఉన్న విషయం తెల్సిందే.

సినిమాలకు దూరంగా ఉన్నా.. సోషల్ మీడియాలో మాత్రం నిత్యం యాక్టివ్ గా ఉంటారు. తన కెరీర్ ను చాలామంది డ్యాన్స్ మాస్టర్లు నాశనం చేసారని చెప్పి యూట్యూబ్ లో చాలా ఫేమస్ అయ్యాడు. ఇక ఆయన మాట్లాడిన ప్రతి మాట వైరల్ గా మారింది. యూట్యూబ్ ఇంటర్వ్యూలో ఆట షో గురించి, డ్యాన్స్ షోల గురించి ఆయన ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉండడటంతో రాకేష్ మాస్టర్ కు మతిస్థితిమితం లేకపోవడం వలనే ఇలా మాట్లాడుతున్నాడు అని రూమర్స్ పుట్టించారు. ప్రస్తుతం ఆయన మరణవార్తతో టాలీవుడ్ ఇండస్ట్రీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తుంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని అభిమానులతో పాటు సినీ ప్రముఖులు కూడా సంతాపం వ్యక్తం చేస్తున్నారు.