ఈ సమ్మర్‌లో ప్రేక్షకులను మెప్పించి థియేటర్స్‌కు రప్పిస్తోన్న సినిమాగా ‘రాకాస’ సెన్సేషన్ క్రియేట్ బ్లాక్ బస్టర్ అయ్యింది. ఫ్యామిలీ ఆడియెన్స్‌తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పిస్తూ ఈ చిత్రం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. సమ్మర్‌లో ఎంటైర్ ఫ్యామిలీ థియేటర్స్‌కు వచ్చి సినిమాను చూసి ఎంజాయ్ చేస్తుండటం ఈమధ్య కాలంలో అరుదైనప్పటికీ రాకాస సినిమా ఆ ఫీలింగ్‌ను మళ్లీ తీసుకొచ్చింది. ఆడియెన్స్ అందరూ సినిమా చూసి కుటుంబంతో కలిసి చక్కగా నవ్వుకుని వెళుతుండటం మంచి పరిణామం.
Also Read : Tollywood : టాలీవుడ్ హీరో తండ్రి సినీ రంగ ప్రవేశం
సినిమాకు లభిస్తోన్న ఆదరణ కలెక్షన్స్ రూపంలో బాక్సాఫీస్ దగ్గర కనిపిస్తోంది. రోజు రోజుకి సినిమా కలెక్షన్స్ పెరుగుతుండటమే అందుకు కారణం. మూడు రోజుల్లో రాకాస సినిమా రూ.15.80 కోట్ల రూపాయల కలెక్షన్స్‌ను సాధించింది. సినిమాను ఆడియెన్స్ ఓన్ చేసుకున్నారు. కుటుంబంతో కలిసి బయటకు వెళ్లాలంటే ముందుగా ఈ సినిమాను ఆప్షన్‌గా తీసుకుంటున్నారు. అందుకునే సినిమాను మళ్లీ మళ్లీ చూస్తున్నారు. సినిమాకు హిట్ మౌత్ టాక్ కూడా కలిసి రావటం శుభ సూచకం. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్‌సీస్‌లోనూ ఈ సినిమాకు అమేజింగ్ రెస్పాన్స్ వస్తోంది. నార్త్ అమెరికాలో ఇప్పటికే సినిమాకు 250K (రెండున్నర లక్షల) డాలర్ల వసూళ్లను సాధించటం అక్కడ సినిమాకు లభిస్తోన్నరెస్పాన్స్‌ను సూచిస్తోంది. సింపుల్ హ్యుమల్, రిలాక్స్‌డ్‌గా ఫీల్ అవుతుండటంతో వీకెండ్‌లో సినిమాకు తొలి ప్రాధాన్యమిచ్చారు.
‘రాకాస’ ప్రత్యేకంగా ఇంత మంచి విజయాన్ని సాధించటానికి కారణం.. ఇది అన్ని తరాల ప్రేక్షకులకు కనెక్ట్ కావటమే. పిల్లలు ఇందులోని ఫాంటసీ, ఊహాజనిత ఎలిమెంట్స్‌కి ఆకర్షితులవుతుంటే, పెద్దవాళ్లు హ్యూమర్, పాత్రల మధ్య ఉండే డైనమిక్స్‌ని ఎంజాయ్ చేస్తున్నారు. ఇలా బ్యాలెన్స్‌డ్‌గా సినిమాను రూపొందించటంతో కుటుంబమంతా కలిసి థియేటర్స్‌కు వస్తోంది. ఫ్యామిలీస్ రాకాస సినిమాను బలంగా ముందుకు తీసుకెళుతుంటంతో సినిమాకు రోజు రోజుకీ ఆదరణ పెరుగి సమ్మర్ ఎంటర్‌టైనర్‌గా మెప్పిస్తోంది.ఇంత భారీ విజయానికి కారణం కారణం ఫ్యామిలీ ఆడియెన్స్ కారణం. రోజు రోజుకి సినిమాకు ఆదరణ పెరుగుతూ సినిమా థియేటర్స్‌లో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. జీ స్టూడియోస్ సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై ఉమేష్ కుమార్ బన్సాల్‌తో కలిసి నిహారిక కొణిదెల నిర్మించిన చిత్రం ‘రాకాస’. ఈ మూవీకి మానస శర్మ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటించారు.
