Site icon NTV Telugu

Jailer Showcase: బాషా లెవల్ ఎలివేషన్స్.. ‘టైగర్’ ముత్తువేల్ పాండియన్ ఆన్ డ్యూటీ

Jailer Showcase

Jailer Showcase

Rajinikanth’s JAILER Telugu Official ShowCase Video: సూపర్ స్టార్ రజనీకాంత్‌ హీరోగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీనే ‘జైలర్’. సరిగ్గా వారం రోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న క్రమంలో ఈ సినిమా ప్రమోషన్స్ పెద్ద ఎత్తున మొదలు పెట్టింది సినిమా యూనిట్. కళానిధి మారన్ సమర్పణలో సన్ పిక్చర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. జైలర్ ఫస్ట్ సింగిల్ ‘కావాలయ్యా’ పాట తమిళ్ వెర్షన్ లో విడుదలై నేషనల్ వైడ్ గా వైరల్ అన్నీ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ పై టాప్ ట్రెండింగ్ లో దూసుకు పోగా ఆ తర్వాత కూడా ఈ సాంగ్ తెలుగు వెర్షన్ ని విడుదల చేశారు మేకర్స్. ఇక ఇప్పుడు తాజాగా షోకేస్ వీడియో రిలీజ్ చేయగా ఆ వీడియోలో రజనీకాంత్ పాత్ర ‘టైగర్’ ముత్తువేల్ పాండియన్‌ను పరిచయం చేశారు.మామూలుగా చిన్న చిన్న విషయాలకి కూడా భయపడే ఆయన ఒక్కో సంధర్భంలో పోతురాజు పూనినట్టు తన కత్తితో నరికి పోగులు పెడుతూ ఉంటాడు.

Bholaa Shankar Pre-release Event: భోళా ఫ్యాన్స్ గెట్ రెడీ.. ఎన్టీవీలో ఎక్స్ క్లూజివ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ లైవ్

ఒకానొక సందర్భంలో జాకీ ష్రాఫ్ వినాయకన్ కు టైగర్ గురించి ఇచ్చే ఎలివేషన్లు చూస్తే ఇది ట్రెండ్ కి తగ్గట్టు తెరకెక్కించిన బాషా సినిమానా? అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతాయి. ఒక రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ తన శత్రువుల నుంచి తన కొడుకుని, మనవడిని ఎలా కాపాడుకుంటున్నాడు అనే అంశం మీద ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారని ఈ షో కేస్ వీడియోతో కొంత క్లారిటీ వచ్చింది. అయితే మలయాళ స్టార్ మోహన్ లాల్, కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్ వంటి వారిని ఈ షో కేస్ వీడియోలో కనిపించకుండా జాగ్రత్త పడ్డారు. మోహన్ లాల్, శివ రాజ్‌కుమార్ రమ్య కృష్ణన్, తమన్నా తో పాటు వసంత్ రవి, నాగ బాబు, యోగి బాబు, జాఫర్ సాదిక్ తదితరులు ఇతర ముఖ్య పాత్రలో కనిపించనున్న ఈ సినిమాకి విజయ్ కార్తీక్ కన్నన్ కెమెరామెన్ గా పనిచేస్తుండగా ఆర్ నిర్మల్ ఎడిటర్ గా చేస్తున్నారు. ఇక ఈ జైలర్ ఆగస్టు 10న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Exit mobile version