Rajinikanth: సూపర్ స్టార్ రజినీకాంత్, లోక నాయకుడు కమల్ హాసన్ ఎంత మంది స్నేహితులో ప్రత్యేకంగా చెప్పాల్సినవసరం లేదు. కోలీవుడ్ లో స్టార్ హీరోలుగా.. కాదు.. కాదు. సూపర్ స్టార్లుగా వీరినే చెప్తారు. ఎంతోమంది కుర్ర హీరోలకు ఈ ఇద్దరు హీరోలు ఆదర్శం. ఇక ఎప్పుడు వీరిద్దరూ కలిసి కనిపించినా అది సెన్సేషనే. ఇక ఒకరి గురించి ఒకరు మాట్లాడినా ట్రెండ్ అవుతుంది. తాజాగా రజినీకాంత్.. కమల్ గురించి మాట్లాడారు. అంటే అదేదో కావాలని మాట్లాడలేదు. మీడియాకు భయపడి రజినీ క్లారిటీ ఇచ్చినట్లు తెలిపారు. అసలు విషయం ఏంటంటే.. రజినీ.. తాజాగా చెన్నైలోని ఓ ఆసుపత్రి ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంతో మంది ప్రాణాలు కాపాడుతున్న డాక్టర్లకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరాం తన గతంలో జరిగిన ఒక ఇన్సిడెంట్ ను చెప్పుకొచ్చారు.
గతంలో కావేరి హాస్పిటల్ ఎక్కడ అంటే.. కమల్ హాసన్ ఇంటి దగ్గర అని చెప్పేవారు. ఇప్పుడు.. కమల్ ఇల్లు ఎక్కడ అంటే కావేరి హాస్పిటల్ దగ్గర అని చెప్తున్నారు. అంతలా ఈ హాస్పిటల్ పేరు తెచ్చుకుంది. ఇప్పుడు నేను కమల్ గురించి చెప్పాను అని.. మా ఇద్దరి మధ్య విబేధాలు ఉన్నాయని రాయకండి. నేనేదో ఉదాహరణకు చెప్పాలని చెప్పాను. అసలే మీడియా వాళ్ల ముందు మాట్లాడడానికి నేను సంకోచిస్తున్నాను. ఇది ఎలక్షన్ సమయం. నేను ఏది మాట్లాడినా.. వారి ఇష్టానికి అనుకోని రాసేస్తున్నారు. ఈ కెమెరాలను చూస్తుంటేనే నాకు భయమేస్తుంది. నేను ఇప్పుడు ఊపిరి పీల్చుకోవడానికి కూడా భయపడుతున్నాను” అంటూ నవ్వేశారు. ఇక తాను ఎన్నోచోట్ల చికిత్సలు తీసుకున్నాను అని, ఈ డాక్టర్లు ఉండడం వలనే ఇప్పుడు హ్యాపీగా ఉంటున్నాని తెలిపారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
