సూపర్ స్టార్ రజనీకాంత్ ఇంతపెద్ద స్టార్ అవ్వడానికి కారణం ఆయన సింప్లిసిటీ అన్న విషయం తెలిసిందే. ఆయనకు ఇండియాలోనే కాకుండా విదేశాల్లోనూ భారీ సంఖ్యలో అభిమానులు ఉండడానికి రజిని స్టైల్ తో పాటు ఇదీ ఒక రీజన్. తాజాగా సూపర్ స్టార్ అనారోగ్యంతో ఉన్న తన అభిమానికి ఇచ్చిన సర్ప్రైజ్ గురించి చర్చ నడుస్తోంది. సదరు అభిమానికి రజినీ చాలా ప్రత్యేకమైన వీడియో సందేశాన్ని పంపాడు. తలైవా ఆ అభిమాని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ, ఆమెను వ్యక్తిగతంగా కలవడం కుదరనందుకు క్షమాపణలు కూడా చెప్పారు.
Read Also : నాకు నేనే డబ్బా కొట్టుకున్నట్లు ఉంటుంది.. అందుకే చెప్పను – నాని
రజినీ ఆ సర్ప్రైజ్ వీడియోలో మాట్లాడుతూ “హలో సౌమ్యా, ఎలా ఉన్నావు? మీరు త్వరలో పూర్తి ఆరోగ్యంగా కోలుకుంటారు. క్షమించండి కరోనా పరిస్థితి కారణంగా నేను మిమ్మల్ని వ్యక్తిగతంగా కలవలేకపోయాను. పైగా నా ఆరోగ్యం కూడా బాగా లేదు… లేకపోతే నేను నిన్ను తప్పకుండా కలిసే వాడిని. దృఢంగా ఉండు… దేవుడు ఉన్నాడు… నేను మీ కోసం ప్రార్థిస్తాను. మీ చిరునవ్వు ఎంత అందంగా ఉందో చూడు. వర్రీ అవ్వకండి. త్వరగా కోలుకుంటారు” అంటూ తన అభిమానికి ధైర్యం చెప్పారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రజనీకాంత్ బెంగళూరుకు చెందిన అభిమాని సౌమ్య కొన్ని రోజులుగా అనారోగ్యంతో ఉంది. ప్రస్తుతం ఆమె బెంగళూరులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు సమాచారం.
❤🙏🏻 pic.twitter.com/RDcZ3ytJKO
— RajiniBalu🤘 (@RajiniBalu13) December 17, 2021
దర్శకుడు శివ ‘అన్నాత్తే’లో చివరిసారిగా పెద్ద తెరపై కనిపించిన సూపర్ స్టార్ డిసెంబర్ 12న తన 71వ పుట్టినరోజును జరుపుకున్నారు. ఈ పుట్టినరోజు వేడుకలను కుటుంబ సభ్యులతో సెలెబ్రేట్ చేసుకున్నారు. ఈ మధ్య రజనీకాంత్ కొత్త ప్రాజెక్ట్ ఏదీ ప్రకటించలేదు.