Site icon NTV Telugu

Rajinikanth : అలాంటి సినిమాలకు గుడ్‌బై చెప్పిన సూపర్ స్టార్‌..

Rarajini Kamth

Rarajini Kamth

రజినీకాంత్ హీరోగా వచ్చిన ప్రతి సినిమా ఎక్కువ మంది అభిమానులను థ్రిల్ చేయడం, ఫ్యామిలీ ఆడియెన్స్‌కి అనుకూలంగా ఉండడం ముఖ్యమని చెప్పవచ్చు. అయితే తాజాగా ఆయన చివరి మూవీ ‘కూలీ’ రిలీజ్ తర్వాత ఓ నిర్ణయం తీసుకున్నారట . ఎందుకంటే ‘కూలీ’ కి సెన్సార్ బోర్డ్ A సర్టిఫికెట్ జారీ కావడం వల్ల, థియేటర్లలో సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల వద్ద రీచ్ అవ్వలేకపోయింది. ప్రారంభ రోజుల్లో మంచి కలెక్షన్లు  వర్వాలేదు అనిపిచినప్పటికి, మొత్తం ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైందని కోలీవుడ్‌లో వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో సూపర్ స్టార్ రజినీకాంత్ తన తర్వాతి చిత్రాల కోసం ఫ్యామిలీ ఫ్రెండ్లీ ఎంటర్‌టైన్‌మెంట్ పథంలో కొనసాగుతారని తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన ‘జైలర్-2’ సినిమాలో నటిస్తున్నారు.

Also Read : Chiranjeevi : చిరంజీవి కలిసిన TFJA, జర్నలిస్టుల సంక్షేమం పై స్పెషల్ చర్చ

దర్శకుడు సుందర్ సి కొన్ని కథలపై ఆయనతో చర్చించగా, రజినీకాంత్ ఇకపై తన సినిమాల్లో A రేటెడ్ అంశాలు దూరంగా ఉంచే విధంగా జాగ్రత్త పడుతున్నారని ఇన్ సైడ్ టాక్‌ . అంటే అర్థం రజినీకాంత్ త్వరలో ప్రేక్షకుల ముందుకు సమస్త వయసుల వారు ఆనందించగల, యాక్షన్-ఎలిమెంట్స్‌తో కూడిన, ఫ్యామిలీ ఫ్రెండ్లీ సినిమాలు తీసుకురాబోతున్నాడు. ఆయన నిర్ణయం టాలీవుడ్‌లో కొత్త దిశా మార్గాన్ని సూచిస్తున్నట్లే.

Exit mobile version