Rajimi Kanth : సూపర్ స్టార్ రజినీకాంత్ వరుస సినిమాలతో బిజీగా ఉంటున్నాడు. వయసుతో సంబంధం లేకుండా ఆయన సినిమాలు చేస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో కూలీ సినిమాలో నటిస్తున్నాడు. ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఆగస్టు 14న సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. ఇందులో నాగార్జున, ఉపేంద్ర, శృతిహాసన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అయితే ఈ సినిమా కోసం రజినీకాంత్ భారీగా రెమ్యునరేషన్ తీసుకున్నాడంట. ఇప్పుడు ఈ విషయమే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Read Also : Kamal Haasan: కన్నడ, తమిళ వివాదంలో కమల్ హసన్.. కర్ణాటకలో ఆయన సినిమాలపై బ్యాన్..!
ఈ మూవీ కోసం రజినీకాంత్ ఏకంగా రూ.150 కోట్లు తీసుకున్నాడంట. రజినీకాంత్ కెరీర్ లోనే ఈ మూవీకే హయ్యెస్ట్ తీసుకున్నాడనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటి వరకు రజినీకాంత్ ఈ స్థాయిలో తీసుకోలేదంట. అంతే కాకుండా లోకేష్ కూడా రూ.50 కోట్ల దాకా తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. మిగతా నటీనటుల రెమ్యునరేషన్స్, మూవీ బడ్జెట్ కోసం ఇంకో రూ.150 కోట్ల దాకా ఖర్చు చేశారంట. మొత్తంగా మూవీ బడ్జెట్ ఎంత లేదన్నా రూ.350 కోట్లకు పైమాటే అని తెలుస్తోంది. ఎలాగూ లోకేష్ డైరెక్టర్ కాబట్టి అంచనాలు భారీగానే నెలకొన్నాయి. బిజినెస్ కూడా బాగానే చేస్తోంది ఈ సినిమా.
Read Also : Pawan Kalyan : పవన్ ఆదేశాలు.. థియేటర్లలో సోదాలు..
