NTV Telugu Site icon

Rajinikanth: చంద్రముఖి 2.. ఏ యాంగిల్ లో నచ్చింది తలైవా నీకు.. ?

Rajini

Rajini

Rajinikanth: రాఘవ లారెన్స్, కంగనా రనౌత్ జంటగా పి వాసు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం చంద్రముఖి 2. లైకా ప్రొడక్షన్స్ ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. దాదాపు 10 ఏళ్ల క్రితం రిలీజ్ అయిన చంద్రముఖి సినిమాకు ఈ సినిమా సీక్వెల్ గా తెరకెక్కింది. అప్పట్లో రజనీకాంత్, జ్యోతిక, ప్రభు ప్రధాన పాత్రల్లో నటించారు. ఇప్పుడు రజినీ పాత్రను రాఘవ లారెన్స్ చేయగా.. జ్యోతిక పాత్రలో కంగనా కనిపించింది. ఎన్నో అంచనాల నడుమ ఈ సినిమా సెప్టెంబర్ 28న రిలీజ్ అయింది. ఇక హారర్ ఫిల్మ్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా లారెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందులో పి వాసు సైతం హారర్ ఫిల్మ్స్ తీయడంలో దిట్ట. వీరిద్దరి కాంబినేషన్ అనగానే చంద్రముఖి 2 పై ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు అభిమానులు. కానీ, ఆ అంచనాలు విఫలమయ్యాయి. చంద్రముఖి 2 తెలుగు ప్రేక్షకులకు అంతగా నచ్చలేదని తెలుస్తుంది. భయపెట్టడం కాదు కదా కనీసం థ్రిల్ చేసే అంశాలు కూడా లేవని అభిమానులు చెప్పుకొస్తున్నారు. చాలావరకు చంద్రముఖి 2 కు తెలుగులో పాజిటివ్ టాక్ లేదనే చెప్పాలి. అయితే తమిళ్లో మాత్రం ఈ సినిమా ఒక మోస్తరుగా ఆడుతుందని తెలుస్తుంది.

Hariteja: నటి హరితేజ విడాకులు.. ?

తాజాగా ఈ సినిమాపై సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రశంసలు కురిపించాడు. రజనీకాంత్, లారెన్స్ కు మధ్య గురుశిష్యుల అనుబంధం ఉందని అందరికీ తెలిసిందే. అంతేకాకుండా చంద్రముఖి లాంటి హిట్ సినిమాలో నటించడంతో ఈ సినిమాపై తలైవా ఒక సర్ప్రైజ్ నోట్ తో చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపాడు. ” చంద్రముఖి 2 ను ఎంతో కొత్తగా, విభిన్నమైన కోణంలో.. గ్రాండ్ గా, ఎంటర్టైన్మెంట్ చిత్రంగా సినీ అభిమానులకి అందించారు. ఇంత అద్భుతంగా పనిచేసిన పి.వాసు, తమ్ముడు రాఘవ లారెన్స్ కు మరియు చిత్ర బృందానికి అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను” అని రాసుకొచ్చాడు ఇక రజినీ వ్యాఖ్యలకు రాఘవ లారెన్స్ స్పందించాడు. ” ఈరోజు నాకు ఎంతో ఆనందంగా ఉంది.. నా అన్న, నా గురువు తలైవార్ సూపర్ స్టార్ రజినీకాంత్ నుంచి ఇలాంటి సర్ప్రైజ్ నోట్ అందుకోవడం ఎంతో గర్వంగా ఉంది. చంద్రముఖి 2 కు ఇంతకన్నా పెద్ద ప్రశంస ఇంకేం కావాలి.. మీ ప్రోత్సాహమే మాకు ప్రపంచం.. థాంక్యూ తలైవా” అంటూ రాసుకొచ్చాడు. ఇక ఈ పోస్ట్ పై అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. సినిమాలో ఏం చూసి మీకు నచ్చిందని చెప్తున్నారు. ఏ యాంగిల్ లో సినిమా బావుందని చెప్తున్నారు. అది కూడా చెప్పండి అని కామెంట్స్ పెడుతున్నారు. ఇంకా మరికొంతమంది అంతా ఆర్టిఫీషియల్ గా ఉంది.. రజినీని మచ్చుకైనా చూపించలేదు.. కనీసం ఆయన పేరును కూడా వాడలేదు.. అసలు ఇది చంద్రముఖిలానే లేదు అని చెప్పుకొస్తున్నారు.

Show comments