Rajinikanth Jailer special screening with UP CM Yogi Adityanath: సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ ‘జైలర్’ సినిమాతో హిట్ అందుకుని మాంచి జోష్ లో ఉన్నారు. ఈ సినిమా విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను కూడా రాబడుతోంది. ఇదిలా ఉంటే, సాధారణంగా సినిమాను ప్రమోట్ చేయాల్సిన ఆయన రిలీజ్ కు ముందు రోజే హిమాలయాలకు వెళ్లిపోయారు. జైలర్ విడుదల తర్వాత ఆధ్యాత్మికంగా ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. ముందుగా హిమాలయాలు, జార్ఖండ్‌లోని రాంచీలోని రాజారప్ప ఆలయాన్ని సందర్శించిన తర్వాత ఆయన ఇప్పుడు పవిత్ర నగరమైన అయోధ్యను సందర్శించనున్నారు. జైలర్ సినిమా 2023 ఆగస్టు 10న తమిళం, తెలుగు భాషల్లో థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇక ఆయన ఈరోజు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను కలుసుకుని ఆయనతో కలిసి ‘జైలర్’ సినిమాను చూడబోతున్నారు.
Anasuya Bharadwaj: గుక్క పెట్టి ఏడుస్తూ వీడియో షేర్ చేసిన అనసూయ.. అసలు ఏమైందంటే?
అయితే తాజాగా ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో చేరుకున్న సూపర్ స్టార్ రజనీకాంత్ శనివారం రాజ్ భవన్ లో గవర్నర్ ఆనందీబెన్ పటేల్ ను కలిశారు. సూపర్ స్టార్ రజనీకాంత్ శుక్రవారం ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో చేరుకున్నప్పుడు, సూపర్ స్టార్ మీడియాతో ఇంటరాక్ట్ అయ్యారు. అప్పుడే యుపి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో తన ‘జైలర్’ చిత్రాన్ని చూడాలనే తన ప్రణాళికలను కూడా పంచుకున్నాడు. గతంలో రజనీకాంత్ జార్ఖండ్, రాంచీలో చిన్నమాస్తా ఆలయంలో ఆయన దర్శనం చేసుకున్నారు. అంతకుముందు, హిమాలయాలకు ఆధ్యాత్మిక యాత్రకు కూడా వెళ్ళాడు, అక్కడ ఆయన ఫోటోలు చాలా వైరల్ అయ్యాయి. ఇక మరోపక్క రజనీకాంత్ తదుపరి సినిమాపై కూడా చర్చ జోరందుకుంది. వచ్చే నెలలో ఈ సినిమా సెట్స్ మీదకు వస్తుందని చెబుతున్నారు. ఈ సినిమాలో ఆయన బాలీవుడ్ సీనియర్ నటుడు అమితాబ్ బచ్చన్ తో కలిసి నటించే అవకాశం ఉందని అంటున్నారు. అదే నిజమైతే 32 ఏళ్ల తర్వాత ఈ ఇద్దరూ కలిసి తెరపై కనిపించనున్న సినిమాగా ఇది రికార్డులకు ఎక్కనుంది. గతంలో వీరిద్దరూ కలిసి ‘హమ్’ సినిమాలో నటించారు.