కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో గత కొన్నేళ్లుగా అజిత్, విజయ్ ల మధ్య బాక్సాఫీస్ వార్ జరుగుతోంది. మా హీరో గొప్ప అంటే కాదు మా హీరో గొప్ప… మా హీరో సినిమా ఎక్కువ కలెక్ట్ చేసింది అంటే కాదు మా హీరో సినిమానే ఎక్కువ కలెక్ట్ చేసింది అంటూ అజిత్-విజయ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కూడా గొడవలు పడిన సందర్భాలు చాలానే ఉన్నాయి. టాప్ హీరో చైర్ లో అజిత్-విజయ్ లలో ఏ హీరో కూర్చుంటాడు అనే ప్రశ్నకి అక్కడి ఇండస్ట్రీ వర్గాలు, మీడియా కూడా తేల్చి చెప్పలేని పరిస్థితి ఉంది. ఈ ఇద్దరి హీరోల సినిమాలు బ్యాక్ టు బ్యాక్ 200 కోట్లు కలెక్ట్ చేసిన దాఖలాలు చాలానే ఉన్నాయి, అందుకే టాప్ చైర్ లో కూర్చోవడానికి అజిత్ విజయ్ ల మధ్య వార్ తప్పదు అంటూ మీడియా కూడా తేల్చి చెప్పింది. ఇలా అజిత్ కి విజయ్ కి మధ్య బాక్సాఫీస్ వార్ జరుగుతున్న సమయంలో… ది ఈగల్ ఈజ్ కమింగ్ అంటూ లోకనాయకుడు కమల్ హాసన్ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. విక్రమ్ సినిమాతో 450 కోట్లు రాబట్టి అజిత్-విజయ్ ల కన్నా పైన కూర్చున్నాడు. ఎన్ని రోజులు అయినా కమల్ హాసన్ కి తిరుగేలేదు, ఇక ఇప్పట్లో విక్రమ్ కలెక్షన్స్ బ్రేక్ అయ్యే అవకాశమే లేదు అంటే… మీరంతా కొట్టుకుంటూ ఉంది సెకండ్ ప్లేస్ కోసం ఎందుకంటే ఐ యామ్ ది వన్, సూపర్ వన్ అని ప్రతి ఒక్కరితో అనిపించేలా చేసాడు సూపర్ స్టార్ రజినీకాంత్.
గత కొన్నేళ్లుగా ఫ్లాప్ స్ట్రీక్ మైంటైన్ చేస్తున్న రజినీకాంత్ పని అయిపొయిందని కోలీవుడ్ ఇండస్ట్రీ వర్గాలు బాహాటంగానే కామెంట్స్ చేసాయి. నిజానికి రజినీ ఫ్లాప్స్ లో ఉన్నప్పటి నుంచే టాప్ చైర్ డిస్కషన్ స్టార్ట్ అయ్యింది, అంతక ముందు వరకూ రజినీ తర్వాతే ఎవరైనా. ఈ విషయాన్ని మరోసారి ప్రూవ్ చేస్తూ జైలర్ సినిమాతో 600 కోట్లకి పైగా రాబడుతున్నాడు రజినీకాంత్. నెల రోజులు కూడా అవ్వకముందే జైలర్ సినిమా 600 కోట్ల కలెక్షన్స్ ని రాబట్టింది అంటే రజినీ ఇమేజ్ ఏ రేంజులో ఉందో అర్ధం చేసుకోవచ్చు. కోలీవుడ్ హిస్టరీలో 600 కోట్లు కలెక్ట్ చేసిన సినిమాలు రెండే ఉన్నాయి… ఆ రెండు కూడా రజినీకాంత్ వే కావడం విశేషం. రోబో 2.0 సినిమాతో 750 కోట్ల కలెక్షన్స్ ని రజినీకాంత్ రాబట్టాడు, ఈ ఫ్లాప్ సినిమా కలెక్షన్స్ ని ఇప్పటివరకూ ఏ సూపర్ హిట్ సినిమా కూడా బ్రేక్ చేయలేకపోయింది. అందుకే అజిత్-విజయ్ లాంటి వాళ్ళు స్టార్స్ అయి ఉండొచ్చు కానీ సూపర్ స్టార్ మాత్రం రజినీకాంత్ ఒక్కడే అనే మాట చెప్పాల్సి వస్తుంది.