Site icon NTV Telugu

Rajinikanth: జైలర్ నటుడు మృతి.. ఎమోషనల్ అయిన రజినీ

Marimuthu

Marimuthu

Rajinikanth: కోలీవుడ్ చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకున్న విషయం తెల్సిందే. నటుడు, డైరెక్టర్ అయిన మారిముత్తు నేడు గుండెపోటుతో మరణించారు. దీంతో ఒక్కసారిగా ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. ఈ మధ్యనే రిలీజ్ అయ్యి భారీ హిట్ అందుకున్న జైలర్ సినిమాలో మారిముత్తు వర్మ గ్యాంగ్ లో కీలక పాత్ర పోషించిన విషయం తెల్సిందే. దాదాపు 100కు పైగా సినిమాల్లో నటించిన ఆయన.. సీరియల్స్ ద్వారా కెరీర్ ను ప్రారంభించాడు. ఎన్నో అద్భుతమైన పాత్రల్లో నటించి మెప్పించిన మారిముత్తు.. జైలర్ సినిమా తరువాత మరిన్ని అవకాశాలను అందుకుంటాడని అందరు అనుకున్నారు. కానీ, ఇంతలోపే ఆయన గుండెపోటుతో మరణించడం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.

Naveen Polishetty: పొలిశెట్టి గట్టిగానే కొట్టాడు!

ఇకపోతే ఆయన మృతిపట్ల అభిమానులతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. తాజాగా సూపర్ స్టార్ రజినీకాంత్.. ట్విట్టర్ వేదికగా.. మారిముత్తుకు సంతాపం తెలిపాడు. “మారిముత్తు ఒక అద్భుతమైన వ్యక్తి. ఆయన మృతి వార్త విని నేను షాక్ అయ్యాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. ఆయన కుటుంబానికి నా హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నాను” అంటూ తెలిపాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.

Exit mobile version