డిసెంబర్ 12న సూపర్ స్టార్ రజినీకాంత్ పుట్టిన రోజు(Rajinikanth Birthday Special), ఈ సంధర్భంగా రజినీ నటించిన ‘బాబా’ సినిమాని గ్రాండ్ లెవల్లో రీ-రిలీజ్ చేశారు(BABA ReRelease). డిసెంబర్ 11న విడుదలవ్వాల్సిన ‘బాబా రీమాస్టర్డ్ వర్షన్, అనుకున్న డేట్ కన్నా ఒకరోజు ముందే డిసెంబర్ 10నే ప్రీమియర్స్ వేసేసారు. తమిళనాట రజినీ సినిమా అంటే అదో పెద్ద పండగలా సంబరాలు చేసుకుంటారు. ఈ సంబరాలు రెండు దశాబ్దాల క్రితం రిలీజైన ఒక ఫ్లాప్ సినిమాకి ఇప్పుడు చేస్తున్నారు అంటే రజినీ ఫ్యాన్ బేస్ ఏంటో అర్ధం చేసుకోవచ్చు. తమిళనాడులోని అన్ని సెంటర్స్ లో ఉదయం 8:00 గంటలకే ఫస్ట్ షో పడింది. చెన్నైలోని ఒక థియేటర్ లో వేసిన ప్రీమియర్ కి ‘బాబా’ చిత్ర యూనిట్ తో పాటు ‘రాఘవ లారెన్స్’, ‘సౌందర్య రజినీకాంత్, ‘లతా రజినీకాంత్’లు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు.
2002లో రిలీజ్ అయిన బాబా మూవీని సురేష్ కృష్ణ డైరెక్ట్ చేయగా, మనీషా కోయిరాలా హీరోయిన్‌గా నటించింది. బాబా మూవీలో రజినీ స్టైల్ అండ్ స్వాగ్ సూపర్బ్‌గా ఉంటాయి. రజినీ స్టైల్‌గా నడిచొస్తుంటే, ఏఆర్ రెహమాన్ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌కి థియేటర్స్‌లో విజిల్స్ పడ్డాయి. బాబా కౌంటింగ్ స్టార్ట్ అంటూ రజినీ డైలాగ్ చెప్తే, తలైవర్ అభిమానులు థియేటర్ టాప్ లేపారు. గతం గతం అంటూ ఆయన చెప్పే డైలాగ్, ఇప్పటికీ ఎక్కడో ఒక చోట వింటూనే ఉంటాం. ఫస్ట్ రిలీజ్‌లో బాబా సినిమా ఆడియన్స్ ని అంతగా మెప్పించలేదు కానీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైంకి బాబా సినిమాకి ఒక కల్ట్ స్టేటస్ వచ్చింది. ఈ మూవీ క్లైమాక్స్‌లో రజినీకాంత్, సాదువుల్లో కలిసి పోకుండా తిరిగి జనాల కోసం వచ్చేయడం చూసి… ఇది రజినీ పొలిటికల్ ఎంట్రీకి చిన్న సాంపిల్ ఏమో అనుకున్న వాళ్లు కూడా ఉన్నారు. హిట్, ఫ్లాప్ అనేది పక్కన పెడితే ‘బాబా’ మూవీ కంప్లీట్ ఫ్యాన్ స్టఫ్‌తో పవర్ ప్యాక్డ్‌గా ఉంటుంది. అందుకే తలైవర్ అభిమానులు రెండు దశాబ్దాల తర్వాత కూడా థియేటర్స్ లో ఈ మూవీని చూసి ఎంజాయ్ చేస్తున్నారు.