Site icon NTV Telugu

Rajinikanth: తలైవా జోరు.. దెబ్బకు రెండు సినిమాలు

Rajini

Rajini

Rajinikanth: సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం జైలర్ సినిమాతో బిజీగా ఉన్న విషయం విదితమే. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకొంటుంది. ఇక ఈ సినిమా పూర్తికాకముందే తలైవా జోరు పెంచేశాడు. ఒకటి కాదు ఏకంగా రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. పనికి వయస్సుతో సంబంధం లేదని నిరూపించేశాడు. యాదాద్రికి ఒక్క సినిమాతో నెట్టుకొస్తున్న కుర్రహీరోలకు ఏకంగా రెండు, మూడు సినిమాలను లైన్లో పెట్టి షాక్ ఇస్తున్నాడు.

రజనీకాంత్‌ తాజాగా లైకా ప్రొడక్షన్ సంస్థలో రెండు సినిమాలకు సైన్‌ చేశాడు. నవంబర్ 4 న ఈ రెండు సినిమాలు సెట్స్ మీదకు వెళ్లనున్నాయి. ఈ విషయాన్నీ లైకా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అయితే అందుతున్న సమాచారం ప్రకారం.. ఒక సినిమాకు మణిరత్నం దర్శకత్వం వహిస్తుండగా.. మరొక సినిమాకు శిబి దర్శకత్వం వహిస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. మణిరత్నంతో రజినీ సినిమా పొన్నియిన్ సెల్వన్ ప్రెస్ మీట్ లోనే కన్ఫర్మ్ అయ్యింది. ఇక రెండోది డాన్ తో సూపర్ హిట్ అందుకున్న శిబి.. గతంలోనే ఈ కుర్ర డైరెక్టర్ తో రజినీ సినిమా చేస్తునట్లు వార్తలు వచ్చాయి. మరి ఇందులో ఏది నిజమో తెలియాలంటే నవంబర్ 4 వరకు ఆగాల్సిందే.

Exit mobile version