Site icon NTV Telugu

Karur Stampede : గుండె వణికిపోయింది.. తొక్కిసలాటపై రజినీకాంత్, కమల్ హాసన్ రియాక్ట్

Rajini

Rajini

Karur Stampede : తమిళనాడులోని కరూర్ లో విజయ్ ర్యాలీలో జరిగిన తొక్కిసలాట తీవ్ర విషాదం నింపింది. ఇప్పటికే 40 మంది దాకా చనిపోయారు. ఇంకా పదులకొద్దీ ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ విషాద ఘటనపై ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీలు స్పందిస్తున్నారు. తమిళనాడు అగ్ర హీరోలు అయిన రజినీకాంత్, కమల్ హాసన్ కూడా స్పందించారు. ఈ ఘటనపై కమల్ స్పందిస్తూ.. కరూర్ తొక్కిసలాట గురించి విని నా గుండె వణికిపోయింది. ఆ వార్తలు వింటుంటే దుఃఖం ఆగట్లేదు. చనిపోయిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. గాయపడ్డ వారు త్వరలో కోలుకోవాలని కోరుతున్నా అని తెలిపారు.

Read Also : Kayadu Lohar : విజయ్ ఎంత మందిని బలితీసుకుంటావ్.. ట్విస్ట్ ఇచ్చిన హీరోయిన్

రజినీకాంత్ స్పందిస్తూ.. కరూర్ తొక్కిసలాట గురించి తెలుసుకుని షాక్ అయ్యాను. వాళ్ల మరణాలు నాకు ఎంతో బాధను మిగిల్చాయి. ఇలా అవుతుందని నేను ఊహించలేదు. చనిపోయిన వారికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలి. ఇలాంటి టైమ్ లో వాళ్లకు భగవంతుడు అండగా ఉండాలని కోరుతున్నా అని తెలిపారు రజినీకాంత్. ఇక విజయ్ కూడా ఈ విషాద ఘటనపై స్పందించారు. మృతుల కుటుంబాలకు రూ.20 లక్షల పరిహారం ప్రకటించారు.

Read Also : Bigg Boss : సంజనా కాదు.. ఇంట్రెస్టింగ్ కంటెస్టెంట్ ఎలిమినేట్

Exit mobile version