Rajinikanth Amitabh Bachchan To Join Hands After 32 Years: సాధారణంగా ఒక స్టార్ హీరో సినిమాని థియేటర్‌లో చూస్తేనే.. అభిమానులు క్రేజీగా ఫీల్ అవుతారు. అలాంటిది.. ఇద్దరు దిగ్గజాలు కలిసి వెండితెరపై కనిపిస్తే ఎలా ఉంటుంది? మాటల్లో కూడా ఆ అనుభూతిని వర్ణించలేం. అలాంటి ఎక్స్‌పీరియన్స్‌ని ప్రేక్షకులు ఇచ్చేందుకు తమిళ దర్శకుడు టీజే జ్ఞానవేల్ రాజా సిద్ధమవుతున్నాడని సమాచారం. సూపర్‌స్టార్ రజినీకాంత్‌తో ఓ సినిమా చేస్తున్న దర్శకుడు.. ఇందులో ఓ కీలక పాత్ర కోసం బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్‌ను రంగంలోకి దింపుతున్నాడని వార్తలొస్తున్నాయి.
Samantha Ruth Prabhu: సమంత.. ముఖం కనిపించని ఆ వ్యక్తి ఎవరు?
అయితే.. ఇందులో అమితాబ్‌ది పూర్తిస్థాయి పాత్ర కాదని, కేవలం కొన్ని నిమిషాల వరకే ఉంటుందని టాక్ వినిపిస్తుంది. ఓ కీలకమైన సమయంలో అమితాబ్ వచ్చి, రజినీకాంత్‌కి సహాయం చేస్తారని, ఈ సీక్వెన్స్‌కి థియేటర్లు బద్దలైపోవడం ఖాయమని చెప్తున్నారు. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన మేకర్స్ నుంచి ఇంకా రాలేదు కానీ, సన్నిహిత వర్గాలు మాత్రం ఈ వార్త నిజమేనని బల్లగుద్ది మరీ చెప్తున్నాయి. ఇంతకుముందు ‘హమ్’, ‘అంధా కానూన్’, ‘గిరఫ్తార్’ సినిమాల్లో వెండితెర పంచుకున్న రజినీ, అమితాబ్.. 32 సంవత్సరాల తర్వాత ‘తలైవర్170’ సినిమాలో కలిసి నటించబోతున్నారని తెలిసింది. ఇదే నిజమైతే మాత్రం.. ఈ సినిమా ఇండియన్ రికార్డులను తిరగరాయడం ఖాయమని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Ileana Dcruz: ఎట్టకేలకు ప్రియుడు ఫోటో రివీల్ చేసిన ఇలియానా.. కానీ!
గతంలో దర్శకుడు శంకర్.. ఈ క్రేజీ కాంబో కుదర్చాలని ప్రయత్నించాడు. తన 2.0 సినిమాలో అమితాబ్‌ను విలన్‌గా తీసుకోవాలని ప్రయత్నించాడు. అయితే.. అమితాబ్‌ను విలన్‌గా భారతీయ ప్రజలు చూడలేరని చెప్పి, ఈ సినిమా చేయొద్దని స్వయంగా రజినీకాంత్ సూచించారు. దాంతో.. ఆయన స్థానంలో అక్షయ్ కుమార్ రంగంలోకి దిగాడు. కాగా.. తలైవన్170 సినిమా యధార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతోంది. అత్యంత భారీ బడ్జెట్‌తో లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో రజినీకాంత్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం సమకూర్చనున్న ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. 2024 చివర్లో ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది.