సూపర్ స్టార్ రజినీకాంత్ నుంచి పేట సినిమాతో తర్వాత ఆ రేంజ్ మూవీ రాలేదు. తలైవర్ ఫ్యాన్స్ కూడా రజినీ నుంచి ఒక్క హిట్ సినిమా వస్తే చూడాలని చాలా రోజులుగా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఆ ఒక్క హిట్ తో ఎన్నో విమర్శలకి చెక్ పెట్టాలని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్న టైంలో ‘జైలర్’ సినిమా వారి వెయిటింగ్ కి ఎండ్ కార్డ్ వేసింది. నెల్సన్ డైరెక్ట్ చేసిన జైలర్ సినిమా అన్ని సెంటర్స్ లో హిట్ టాక్ సొంతం చేసుకోని సూపర్బ్ రెస్పాన్స్ రాబడుతోంది. వీకెండ్ కంప్లీట్ అయ్యే సరికి అన్నీ మేజర్ సెంటర్స్ లో జైలర్ 80% రికవరీ చేసినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు. ఆ రేంజ్ సినిమాగా జైలర్ నిలుస్తుంది. అయితే ఇప్పటికే జైలర్ రివ్యూ బయటకి వచ్చాయి కాబట్టి ఒక కథగా జైలర్ సినిమా గురించి మాట్లాడుకుంటే ఇది అవుట్ లైన్ గా రెండు సినిమాల కలయికలా అనిపించకమానదు.
లోకనాయకుడు కమల్ హాసన్ నటించిన భారతీయుడు సినిమా, విక్రమ్ సినిమాలని కలిపితే అది జైలర్ లా ఉంటుంది. భారతీయుడు సినిమాలోని ‘సేనాపతి’లా ఒక నిజాయితీ కలిగిన మాజీ జైలర్, కొడుకుని చంపినా వాళ్లని వెట్టుకుంటూ మనవడిని కాపాడుకునే ఒక ఏజెంట్ విక్రమ్ లా రజినీ జైలర్ సినిమాలో కనిపిస్తాడు. క్లైమాక్స్ ట్విస్ట్ రివీల్ అయ్యే టైంకి థియేటర్ నుంచి బయటకి వచ్చి జైలర్ సినిమా కథ గురించి ఆలోచిస్తే వెంటనే భారతీయుడు, విక్రమ్ సినిమాలే గుర్తొస్తాయి. ఆ రెండు సినిమాల్లాగా జైలర్ కూడా సూపర్ హిట్ అయ్యి, కోలీవుడ్ బాక్సాఫీస్ లెక్కలేని తారుమారు చేస్తోంది. మరి డే 1 జైలర్ ఎంత కలెక్ట్ చేసింది? ఫుల్ రన్ లో ఎంత రాబడుతుంది? ఏ రేంజ్ హిట్ అవుతుంది అనేది చూడాలి.