Rajini: వీకెండ్ కాదు, పండగ లేదు… సెలబ్రేషన్ మాత్రం పీక్స్ లో ఉంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నార్త్ నుంచి సౌత్ వరకు… హిందీ నుంచి మలయాళం వరకూ ప్రతి ఫిల్మ్ ఇండస్ట్రీ ఎందరో స్టార్ హీరోలు ఉంటారు. ఈ మధ్య పాన్ ఇండియా మార్కెట్ కూడా మొదలయ్యింది కాబట్టి పాన్ ఇండియా హీరోలు కూడా ఉన్నారు. ఈ స్టార్ హీరోల సినిమాలన్నీ వీకెండ్ కి లేదా పండగ సీజన్ ని లేదా లాంగ్ వెకేషన్ ఉన్న సీజన్ ని టార్గెట్ చేసి తమ సినిమాలని రిలీజ్ చేస్తారు. ఎక్కువ హాలీడేస్ ఉంటే ఎక్కువ మంది ఆడియన్స్ థియేటర్స్ కి వస్తారు అనే ఆలోచనతో అలా స్టార్ హీరోలు తమ సినిమా రిలీజ్ లని ప్లాన్ చేసుకుంటారు. ఇది ఆల్మోస్ట్ అందరు హీరోలకీ వర్తిస్తుంది ఒక్కరికి తప్ప… అతని పేరు రజినీకాంత్. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సోలో సూపర్ స్టార్ గా నిలిచిన రజినీ సినిమా ఎప్పుడు రిలీజ్ అయితే అప్పుడే పండగ, ఆరోజే సంబరాలు. వీకెండ్ తో సంబంధం లేదు, ఫెస్టివల్ సీజన్ అవసరం లేదు. రజినీ సినిమా రిలీజ్ అయితే చాలు కొన్ని కోట్ల మంది ప్రేక్షకులు పండగ చేసుకుంటారు.
రాత్రంతా జాగారం చేసి మరీ మార్నింగ్ షో చూడడానికి థియేటర్స్ కి వెళ్లే ఫ్యాన్స్ ఉన్నప్పుడు రజినీకి ఫెస్టివల్ సీజన్ తో సంబంధం ఏముంది. ఇదే విషయాన్ని మరోసారి ప్రూవ్ చేసింది జైలర్ సినిమా. రెండు వారాల క్రితం అసలు బజ్ లేని ఈ సినిమా ట్రైలర్ అండ్ ఆడియో లాంచ్ దెబ్బకి హ్యూజ్ బజ్ ని క్రియేట్ చేసింది. జైలర్ పై ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. ప్రీబుకింగ్స్ రచ్చ లేపే రేంజులో ఉన్నాయి. ముఖ్యంగా ఓవర్సీస్ లో రజినీకాంత్ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాడు. అన్ని తమిళ సినిమాలకి రికార్డులని చెల్లాచెదురు చేస్తూ జైలర్ బుకింగ్స్ టాప్ ట్రెండింగ్ లో ఉన్నాయి. ప్రీమియర్స్ కే అమెరికాలో వన్ మిలియన్ డాలర్ జైలర్ కలెక్ట్ చేసింది, ఓవరాల్ గా 1.5 మిలియన్ డాలర్ ఓవర్సీస్ మార్కెట్ లో ఇప్పటివరకూ అయిన బుకింగ్స్. కబాలి కోలీవుడ్ హయ్యెస్ట్ గ్రాసర్ డే 1లో, ఇప్పుడు మిగిలిన అన్ని సినిమాలని వెనక్కి నెట్టి సెకండ్ ప్లేస్ లో జైలర్ ఉంది. ఫుల్ రన్ లో ర్యాంపేజ్ ఏ రేంజులో ఉంటుందో చూడాలి.
Also Read
- Kona Venkat : హీరోలు భారీ బడ్జెట్ సినిమాల మోజులో పడి కాలం వృధా చేస్తున్నారు
- Vijay Deverakonda :3 -4 నెలల పాటు రాయలసీమ మాండలికంపై సాధన చేశా
- Vijay Deverakonda: "బ్రిటిషర్లు రైల్వేలు వేసింది మన కోసం కాదు.. దేశాన్ని దోచుకోవడానికే!".. దేవరకొండ సంచలన వ్యాఖ్యలు
- Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
తాజావార్తలు
-
Mohammed Shami: భువీని సెలెక్ట్ చేసి.. నన్ను దూరం పెట్టారు: మహ్మద్ షమీ ఎమోషనల్ కామెంట్స్
-
Vijay Deverakonda : ఏడేళ్ళ ఎక్స్పీరియన్స్ రౌడీ హీరోని మార్చలేదా?
-
Rahul Gandhi: ఎన్ని వేల మంది పోలీసులు వచ్చినా భయపడం.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
-
CJP: ‘‘షేమ్.. షేమ్..’’ విమానంలో CJP నేతలకు అవమానం.. తోటి ప్రయాణికుల నుంచి వ్యతిరేకత!
-
Kona Venkat : హీరోలు భారీ బడ్జెట్ సినిమాల మోజులో పడి కాలం వృధా చేస్తున్నారు
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!