Vijay: ఒక సినిమా అన్నాకా మద్యపానం, ధూమపానం లేకుండా ఉండదు. కేవలం సినిమాను సినిమాల చూస్తే ఎవరికి ప్రాబ్లెమ్ ఉండదు. కానీ, కావాలని కొంతమంది సినిమాలో లేనిపోని వాటిని వెతికి వివాదాలు పేరుతో ఫేమస్ కావాలని చూస్తూ ఉంటారు. ప్రస్తుతం లియో సినిమా ఇలాంటి వివాదాస్పద ఆరోపణలనే ఎదుర్కొంటుంది. విషయంలోకి వెళితే.. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ – లోకేష్ కనగరాజ్ కాంబోలో వస్తున్న చిత్రం లియో. ఇక ఈ మధ్యనే విజయ్ పుట్టినరోజు సందర్భంగా ఒక సాంగ్ ను రిలీజ్ చేశారు. నా రెడీనా అంటూ సాగిన ఈ సాంగ్ మొత్తంలో విజయ్ సిగరెట్ తోనే కనిపిస్తాడు. దీంతో యూత్ ను తప్పుదోవ పట్టించే విధంగా ఈ పాట ఉందని, ఈ మధ్యనే విద్యార్థులకు మంచి మాటలు చెప్పిన విజయ్.. ఇప్పుడు ఇలా సిగరెట్ తాగి, వారిని చెడగొడుతున్నాడు అంటూ చెప్పుకొస్తూ కొంతమంది విజయ్ పై, లోకేష్ పై పోలీస్ కేసు పెట్టారు. వెంటనే ఆ సాంగ్ ను డిలీట్ చేయాల్సిందిగా డిమాండ్ చేశారు. అందులో ఆల్ పీపుల్ పొలిటికల్ పార్టీ నాయకురాలు రాజేశ్వరి ప్రియ కూడా.ఉంది ఆమె కూడా చిత్ర బృందంపై కేసు పెట్టింది.
ఇక ఈ విషయం తెలుసుకున్న విజయ్ అభిమానులు.. సోషల్ మీడియాలో ఆమెను ఏకిపారేస్తున్నారు. మా హీరోపైనే కేసు పెడతావా అంటూ అసభ్యకరమైన పదజాలంతో తిట్టిపోస్తున్నారు. ఇక వాటిని తట్టుకోలేని ఆమె.. మీడియా ముందుకు వచ్చి విజయ్ పియా సంచలనం ఆరోపణలు చేసింది. విజయ్ కావాలనే ఇలా చేస్తున్నాడని, అతని ఫ్యాన్స్ ను రెచ్చగొట్టి తనను బూతులు తిట్టిస్తున్నాడని తెలిపింది. యువతను చెడగొడుతున్నాడు అని అడిగినందుకు విజయ్ తనను బెదిరిస్తున్నాడు అంటూ చెప్పుకొచ్చింది. అతన్ని అరెస్ట్ చేయాలనీ ఆమె డిమాండ్ చేసింది. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
